మైనర్ అమ్మాయిల నగ్న చిత్రాలతో టీడీపీ ఎంపీ బృందం బ్లాక్ మెయిల్

టీడీపీ ఎంపీ తోట నర్సింహం, అతడి అనుచరులపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. తక్కువ ధరకు కోట్లాది రూపాయల విలువైన భూములు కాజేసేందుకు ఎంపీ, అనుచరులు నీచమైన దారిని ఎంచుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు మైనర్ అమ్మాయిల నగ్న చిత్రాల సాయంతో వారి తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారు. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. 24 గంటల్లో నిందితులపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్’ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కమిషన్ ఆదేశించిందని ఉమ్మడి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యుడు అచ్యుతరావు, బాధితుడు రవికుమార్ వెల్లడించారు.

కాకినాడకు చెందిన సూరవరపు వెంకట రవికుమార్‌కు కాకినాడ సిటీ, రూర‌ల్‌లో కోట్లాది రూపాయ‌ల విలువైన స్థ‌లాలు ఉన్నాయి. వీటిని త‌క్కువ ధ‌ర‌కు సొంతం చేసుకోవాల‌ని భావించిన ఎంపీ తోట న‌ర్సింహం ప‌లుమార్లు ర‌వికుమార్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే వాటిని అమ్మేందుకు ర‌వికుమార్ అంగీక‌రించ‌లేదు. దీంతో ఎంపీ త‌న అనుచ‌రుల‌ను రంగంలోకి దింపారు. ఎంపీ బంధువులైన కోన విశ్వేశ్వరయ్య అలియాస్ శ్రీరామయ్య, బొండా సూర్యరావు, చక్కపల్లి సత్యనారాయణ, చక్కపల్లి గణేష్, చక్కపల్లి రమణలు వేధిస్తూ వ‌స్తున్నారు. అయినా ర‌వికుమార్ వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌డంతో అత‌డి కూతుర్ల‌పై క‌న్నేశారు.

ర‌వికుమార్ పెద్ద కుమార్తె ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల మ‌మ‌త స్కానింగ్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. ఎక్స్‌రే పేరు చెప్పి బ‌ట్ట‌లు మార్చుకోవాల్సిందిగా అమ్మాయికి సూచించారు. ఈ స‌మ‌యంలో అమ్మాయి న‌గ్న చిత్రాల‌ను రికార్డు చేశారు. అలాగే ర‌వికుమార్ చిన్న‌కుమార్తెను స్పెష‌ల్ క్లాస్ పేరుతో టీచ‌ర్ తోట స‌త్యానందం సెల‌వు రోజు స్కూల్‌కు ర‌ప్పించాడు. అలా వ‌చ్చిన చిన్నారిని మేడ‌పైకి తీసుకెళ్లి నగ్నంగా సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు. వీటిని ఎంపీ అనుచ‌రుల‌కు పంపాడు టీచ‌ర్‌. ఇలా ర‌వికుమార్‌కు చెందిన ఇద్ద‌రు మైన‌ర్ కుమార్తెల నగ్న చిత్రాల సాయంతో ఎంపీ గ్యాంగ్ బ్లాక్ మెయిల్ చేయ‌డం మొద‌లుపెట్టింద‌ని బాధితుడు చెబుతున్నారు. వెంట‌నే స్థ‌లాలు తాము చెప్పిన ధ‌ర‌కు అమ్మ‌క‌పోతే న‌గ్న చిత్రాల‌ను ఫేస్ బుక్, యూట్యూబ్‌లో పెడుతామ‌ని బెదిరించారని చెప్పారు.

ఈ బ్లాక్‌మెయిల్ పై కాకినాడ ఎస్పీ, డీఎస్పీ, సిఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అక్క‌డ కూడా స్పంద‌న లేక‌పోవ‌డంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు ర‌వికుమార్ చెప్పారు. కమిషన్ సభ్యులు సుమారు నాలుగు నెలలపాటు ప్రాథమిక విచారణ చేపట్టి సోమవారం స్పీడ్ పోస్టు ద్వారా సీఎం చంద్రబాబుకు, తమకు నోట్‌ను పంపారన్నారు. ఈ నోట్ ఆధారంగా 24 గంటల్లో నిందితులపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్’ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదేశించిందన్నారు. ఈ ఘటనపై హోం ముఖ్య కార్యదర్శి, డీజీపీ రాముడులను బాధ్యులను చేస్తూ కమిషన్ నోటీసులు పంపిందని ఉమ్మడి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యుడు అచ్యుతరావు తెలిపారు. అయితే ఎంపీ తోట న‌ర్సింహంపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కాకినాడ డీఎస్‌పీ ఎస్. వెంక‌టేశ్వ‌ర‌రావు ఖండించారు. ఎంపీపై చేసిన ఆరోప‌ణ‌ల‌న్నీ నిరాధార‌మైన‌వ‌ని చెప్పారు. మొత్తం మీద టీడీపీ ఎంపీపై ఇలాంటి దారుణ‌మైన ఆరోప‌ణ‌లు రావ‌డంపై టీడీపీ ఎలా స్పందిస్తుందో!.

Click on Image to Read:

YS-Jagan

11

Somu-Veerraju

pinchans

Kavita-Krishnan-free-sex

vishal-nadigar-elections

vishal-comments