ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ప‌బ్లిక్‌గా ఓ రేంజ్‌లో క్లాస్ పీకిన బ‌న్నీ

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు హీరో అల్లుఅర్జున్ క్లాస్ పీకారు. ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని కోరారు. నాగ‌బాబు కూతురు నిహారిక న‌టించిన ఒక మ‌న‌సు సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు హాజ‌రైన బ‌న్నీ అక్క‌డ ప‌వ‌న్ ఫ్యాన్స్ తీరు చూసి బాధ‌ప‌డ్డారు.  ప‌వ‌న్ స్టార్ ఫ్యాన్స్ కు కొన్ని విష‌యాలు చెప్పాల‌నే వ‌చ్చానంటూ బ‌న్నీ క్లాస్ పీకారు. ప‌వ‌న్ అభిమానులు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్ అని అరవ‌డం మొద‌లుపెట్ట‌డంతో బ‌న్నీ కాసేపు మౌనంగా ఉండిపోయారు. మీరు అర‌వ‌డం అయిపోతేనే మాట్లాడుతా అని అన్నారు. ” ప‌వ‌న్ క‌ల్యాణ్ గారి అభిమానులు కొంద‌రు ఇలా ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చి ఒక గ్రూపుగా త‌యారై ప‌వ‌ర్ స్టార్.. ప‌వ‌ర్ స్టార్ అంటూ అరిచి ఇబ్బంది పెడుతున్నారు. అలా అర‌వ‌ద్దు. ప‌ది నిమిషాలు నేను చెప్పేది వినండి. చాలా మంది ఆర్టిస్టులు ఇలాంటి ఫంక్ష‌న్ల‌కు వ‌చ్చిన‌ప్పుడు వారి ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్స్ చెప్పుకోవాల‌నుకుంటారు. కానీ మీరు ప‌వర్ స్టార్ ప‌వ‌ర్ స్టార్ అంటూ అర‌వ‌డంతో వారు భ‌య‌ప‌డిపోతున్నారు. మీ అరుపుల‌కు భ‌య‌పడి ఏదో రెండు మాటలు యాంత్రికంగా చెప్పేసి వెళ్లిపోతున్నారు. అది గుర్తు పెట్టుకోండి.ఎవ‌రైనా మాట్లాడేట‌ప్పుడు అలా చేయ‌డం మంచిదికాదు అని బన్నీ అన్నారు.

”ఒక పెద్ద డైరెక్ట‌ర్ వ‌చ్చి కోట్లు పెట్టి తీసిన త‌న సినిమా గురించి చెబుతుంటే మీరు ప‌వ‌ర్ స్టార్ అంటూ అర‌వ‌డం త‌ప్పు. డైరెక్ట‌ర్‌కు మీరు మ‌ర్యాద ఇవ్వాలి. కొన్ని సార్లు బ‌య‌టి ఫంక్ష‌న్ల‌కు వెళ్లిన‌ప్పుడు కూడా మీరు ఇలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఒక వ్య‌క్తి మా వాళ్ల ఫంక్ష‌న్‌లో మీ వాళ్ల గోల ఏంటి అని న‌న్ను ప్ర‌శ్నించాడు. అప్పుడు చాలా బాధేసింది. బ‌య‌ట ఫంక్ష‌న్ల‌లో ద‌య‌చేసి అలా ప్ర‌వ‌ర్తించ‌వ‌ద్దు. చిరంజీవి గారి వ‌ల్లే తాను ఈస్థాయికి వ‌చ్చాన‌ని ప‌వ‌న్ గారు వంద‌ల‌సార్లు చెప్పారు. కానీ అలాంటి చిరంజీవిగారు మాట్లాడేట‌ప్పుడు కూడా మీరు ప‌వ‌ర్ స్టార్,…ప‌వ‌ర్ స్టార్ అని అర‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. చిరంజీవి గారిని ప‌లుచ‌న చేయ‌వ‌ద్దు” అని బ‌న్నీ గ‌ట్టిగానే చెప్పారు. వ‌రుస‌గా మూడు సినిమాలు హిట్ అయ్యాయి కాబ‌ట్టి ప‌వ‌న్ గురించి తాను మాట్లాడ‌డం మానేశాన‌ని కూడా కొంద‌రు అంటారని… అయినా స‌రే రిస్క్ తీసుకుంటున్నాన‌ని బ‌న్నీ చెప్పారు. ఇక‌పై ప‌బ్లిక్ మీటింగ్‌ల‌కు వెళ్లిన‌ స‌మ‌యంలో అదుపులో ఉండండి అని ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బ‌న్నీ సూచించారు.

Click on Image to Read:

ravindranath-reddy

jagan-deksha

bhuma-nagireddy

thota-narasimham

Buddha-Sesha-Reddy

chevireddy

kodali

kodali-pardasaradi

devineni

raghuveera

ranga

modi-babu-meeting

babu1

Kavita-Krishnan-free-sex

vishal-comments