Telugu Global
NEWS

ప్రెస్‌మీట్‌లో బాబు బాడీ లాంగ్వేజ్ " అవ‌మానానికి ఆన‌వాలా ?

ప్రధాని మోదీని కలిసిన తర్వాత జరిగిన ప్రెస్‌మీట్లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ధాని త‌న‌కు ఎన‌లేని గౌర‌వం ఇచ్చార‌ని చాటుకునేందుకు ఆయ‌న ప్ర‌యత్నించినా అస‌లు విష‌యం ఆయ‌న మాట తీరు, అస‌హ‌నం ద్వారా బ‌య‌ట‌ప‌డిపోయాయి. మీడియా కాస్త క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లు అడిగే స‌రికి బాబుకు చిర్రెత్తుకొచ్చింది. పాజిటివ్ ప్ర‌శ్న‌లు అడ‌గండి.. మ‌సాలా కోసం ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని విలేక‌ర్ల‌కు సూచించారు సీఎం. అంతే కాదు ఒక్క‌సారిగా ‘నాకే ఎందుకీ ఖర్మ.? దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేని కష్టం […]

ప్రెస్‌మీట్‌లో బాబు బాడీ లాంగ్వేజ్  అవ‌మానానికి ఆన‌వాలా ?
X

ప్రధాని మోదీని కలిసిన తర్వాత జరిగిన ప్రెస్‌మీట్లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ధాని త‌న‌కు ఎన‌లేని గౌర‌వం ఇచ్చార‌ని చాటుకునేందుకు ఆయ‌న ప్ర‌యత్నించినా అస‌లు విష‌యం ఆయ‌న మాట తీరు, అస‌హ‌నం ద్వారా బ‌య‌ట‌ప‌డిపోయాయి. మీడియా కాస్త క‌ఠిన‌మైన ప్ర‌శ్న‌లు అడిగే స‌రికి బాబుకు చిర్రెత్తుకొచ్చింది. పాజిటివ్ ప్ర‌శ్న‌లు అడ‌గండి.. మ‌సాలా కోసం ప్ర‌య‌త్నించ‌వ‌ద్ద‌ని విలేక‌ర్ల‌కు సూచించారు సీఎం.

అంతే కాదు ఒక్క‌సారిగా ‘నాకే ఎందుకీ ఖర్మ.? దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేని కష్టం నాకెందుకు.? ప్రతిసారీ కేంద్రాన్ని అడుక్కోవాల్సి వస్తోంది..’ అంటూ చంద్రబాబు మీడియా ముందే అస‌లు ఫీలింగ్ బ‌య‌ట‌పెట్టేశారు. ఒక‌వేళ నిజంగా మోదీతో స‌మావేశం ఆశాజ‌న‌కంగా జ‌రిగి ఉంటే ఇలా నాకే ఎందుకీ క‌ర్మ‌. అడుక్కువాల్సి వ‌స్తోంది అంటూ త‌క్కువ మాట‌లు మాట్లాడే రకం కాదు చంద్ర‌బాబు. కానీ కెమెరాల సాక్షిగా చంద్ర‌బాబు అలా అన్నారంటే మోదీ వ‌ద్ద మ్యాట‌ర్ మ‌రోలా జ‌రిగే ఉంటుంది. అసలు ప్రత్యేక హోదా తదితర అంశాలను మోదీకి చంద్రబాబు నేరుగా వివరించకుండా తెలివిగా ఇబ్బందికర అంశాలను వినతిపత్రం రూపంలో ఇచ్చి చేతులు దులుపుకున్నారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు భేటీలో హోదా లాంటి అంశాలు చర్చకు వచ్చినట్టుగా మోదీ కూడా తన ట్వీట్టర్లో చెప్పలేదు. కేవలం కరువు నివారణ చర్యలపై చర్చించామని సరిపెట్టారు.

”ప్ర‌త్యేక హోదా ఇస్తే ఏమొస్తుందండి.. హోదా ఇచ్చి నిధులు ఇవ్వ‌క‌పోతే ఏం చేస్తాం” అని కూడా బాబు అన్నారు. ఇందులో చాలా లోతైన అర్థ‌మే ఉంది. ప్ర‌త్యేక హోదా సాధించ‌డం త‌న వ‌ల్ల కాద‌న్న నిర్ధార‌ణ‌కు చంద్ర‌బాబు వ‌చ్చేసిన‌ట్టుగా ఉన్నారు. అందుకే ప్ర‌త్యేక‌హోదా వ‌ల్ల పెద్ద‌గా ఉప‌యోగం లేదు…కావాల్సింది నిధులు అని జ‌నం బుర్ర‌ల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలోలాగే మ‌రోసారి గ‌బ్బు చేసేందుకు వ్యూహ‌ర‌చ‌న చేసిన‌ట్టున్నారు. మొత్తం మీద మోదీ నుంచి చంద్ర‌బాబుకు అనుకున్నంత ప్రాధాన్య‌త ల‌భించలేద‌న్న భావ‌న వ్య‌క్తమ‌వుతోంది.

Click on Image to Read:

thota-narasimham

YS-Jagan

11

Somu-Veerraju

pinchans

Kavita-Krishnan-free-sex

vishal-nadigar-elections

vishal-comments

First Published:  17 May 2016 10:23 PM GMT
Next Story