ఆడామగ కాని వారని ఒప్పుకుంటే… మా జగనే మీ పార్టీని నడిపిస్తాడు

జగన్ జలదీక్ష‌లో ఎమ్మెల్యే చెవిరెడ్డి వ‌రుస పంచ్‌ల‌తో చంద్ర‌బాబుపై ప‌డ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరు ఎలా ఉందో వివ‌రించారు. సాధార‌ణంగా దున్నుపోతును లేపాలంటే క‌ర్ర‌తో కొడుతామ‌ని … కానీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం  సాధార‌ణ దున్నపోతు కాద‌ని గ‌డ్డ‌పార తీసుకుని కొట్టాల్సిందేన‌న్నారు. చంద్ర‌బాబు సొంతూరు నారావారిప‌ల్లె అని ఇప్పుడు ఆ ఊరు త‌న నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోనే ఉంద‌ని చెవిరెడ్డి చెప్పారు. అంటే చంద్ర‌బాబు సొంతూరికి కూడా తానే ఎమ్మెల్యేన‌ని దీని బ‌ట్టే చంద్ర‌బాబుపై సొంత ప్ర‌జ‌ల‌కు ఎంత న‌మ్మ‌కం ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు.

చంద్ర‌బాబు ఇటీవల ప్రాజెక్టుల నిద్ర అంటూ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టార‌ని ఆయ‌న‌కు నిజంగా ద‌మ్ముంటే తెలంగాణ ప్ర‌భుత్వం అక్ర‌మంగా నిర్మిస్తున్న పాల‌మూరు ప్రాజెక్టును అడ్డుకుని అక్క‌డే నిద్ర‌పోవాల‌ని సూచించారు. చంద్ర‌బాబు కంటే నీరో చ‌క్ర‌వ‌ర్తి న‌య‌మ‌ని… క‌నీసం రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌బ‌డుతుంటే అక్క‌డే ఉండి ఫిడేల్ వాయించార‌ని అన్నారు. చంద్ర‌బాబు మాత్రం రాష్ట్రం సంక్షోభంలో ఉంటే విహార‌యాత్ర‌లు చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. చ‌రిత్రలో ఎక్క‌డా లేని విధంగా బ‌తికి ఉండ‌గానే ప‌థ‌కాల‌కు చంద్ర‌బాబు త‌న పేరు పెట్టుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే అన్ని ప‌థ‌కాల‌కు రాజ‌న్న పేరు పెడుతామ‌ని… చంద్ర‌బాబు కూడా త‌న ప‌థ‌కాల‌కు రామ‌న్న‌(ఎన్టీఆర్‌) పేరు పెట్టేందుకు సిద్ధ‌మా అని ప్ర‌శ్నించారు. నేల‌ చూపులు చూసే వాడిని న‌మ్మ‌వ‌ద్ద‌ని పెద్ద‌లంటార‌ని… చంద్ర‌బాబు కూడా నేల‌చూపులు చూస్తూనే న‌డుస్తుంటార‌ని చెవిరెడ్డి అన్నారు. కావాలంటే ఇకపై గ‌మ‌నించాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేల ప‌రిస్థితి బ‌లి ఇచ్చే దున్న‌పోతుల్లాగా త‌యారైంద‌న్నారు. బ‌లి ఇచ్చే వారం ముందు దున్న‌పోతుల‌ను బాగా మేపిన‌ట్టుగా… పార్టీలో చేర్చుకునే స‌మ‌యంలోనూ ఎమ్మెల్యేల‌ను బాగా చూసుకున్నార‌ని చెప్పారు. ఇప్పుడు మాత్రం వారిని ప‌ట్టించుకునే నాథుడే లేకుండా పోయార‌ని ఎద్దేవా చేశారు. హైద‌రాబాద్‌లో పోలీస్ స్టేష‌న్లు పెడుతామ‌ని మొద‌ట్లో గొప్ప‌లు చెప్పిన చంద్ర‌బాబు ఓటుకు నోటు కేసు త‌ర్వాత హైద‌రాబాద్ వెళ్లేందుకు కూడా భ‌య‌ప‌డుతున్నార‌ని  అన్నారు. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని టీడీపీలో చేరిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు చంద్ర‌బాబు చేసిన మోసం దెబ్బ‌కు ప‌గ‌లు రాత్రి అన్న తేడా లేకుండా తాగుతూనే ఉన్నాడ‌ని చెవిరెడ్డి చెప్పారు. ఒక ఎమ్మెల్యే త‌న‌ను క‌లిసి జ‌గ‌న్ గారిని ఒప్పిస్తే తిరిగి పార్టీలోకే వ‌స్తాన‌ని వేడుకున్నార‌ని చెప్పారు. రాజ కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి ఇటీవల వైజాగ్ విమానాశ్రయంలో కనిపించారని, ఆయన ముందుకు పోలేక వెన‌క్కు రాలేక మౌనంగా ఉండిపోయార‌ని అన్నారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి వెళ్లిన వారి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉందని, వాళ్లకు జ్ఞానోదయం అయినా భవిష్యత్తు మాత్రం లేదని చెవిరెడ్డి చెప్పారు.

జ‌గ‌న్ త‌యారు చేసిన ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు ఎందుకు తీసుకుంటున్నార‌ని చెవిరెడ్డి ప్ర‌శ్నించారు. టీడీపీలో ఉన్న వారంతా ద‌ద్ద‌మ్మ‌లా, చ‌వ‌ట‌లా, ఆడ‌మ‌గ కాని వారా అని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ అదే నిజ‌మైతే టీడీపీలో ఉన్న‌వారంత ఆడామ‌గ కాని వారేన‌ని చంద్ర‌బాబు ఒప్పుకుంటే టీడీపీని కూడా జ‌గ‌నే న‌డిపిస్తార‌ని చెవిరెడ్డి ఆఫ‌ర్ ఇచ్చారు.

Click on Image to Read:

jagan-deksha

raghuveera

kodali

Buddha-Sesha-Reddy

kodali-pardasaradi

devineni

ranga

modi-babu-meeting

thota-narasimham

babu1

YS-Jagan

11

Somu-Veerraju

Kavita-Krishnan-free-sex

vishal-nadigar-elections

vishal-comments