బాబు బ‌తికుండ‌గానే స‌మాధి క‌ట్టుకునే టైప్… భూమాకు సిగ్గుండాలి

కాపుల ఆత్మ‌గౌర‌వంతో చంద్ర‌బాబు చెల‌గాట‌మాడేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని వైసీపీ నేత అంబ‌టిరాంబాబు మండిప‌డ్డారు. కాపు భ‌వ‌నాల‌కు చంద్ర‌న్న పేరు పెట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. కాపు భ‌వ‌నాల‌కు చంద్ర‌బాబు పేరు పెట్టుకోవాల్సిన ఖ‌ర్మ కాపుల‌కు లేద‌న్నారు. కాపుల్లో కోడిరామ్మూర్తి, ఎస్వీ రంగారావు, వంగ‌వీటి రంగా, సీకే నాయుడు, న‌టి సావిత్రి లాంటి మ‌హానుభావులుండ‌గా చంద్ర‌బాబు పేరు పెట్టుకోవాల్సిన క‌ర్మ త‌మ‌కేం ప‌ట్టింద‌న్నారు. చంద్ర‌బాబు పేరున్న భ‌వ‌నాల్లో కాపులు పెళ్లిళ్లు చేసుకోవాలా అని ప్ర‌శ్నించారు. వెంట‌నే ఈ నిర్ణ‌యం వెనుక్కు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

తాను పోయిన త‌ర్వాత త‌న పేరు ఎవ‌రూ ప‌ట్టించుకోరన్న ఉద్దేశంతోనే చంద్ర‌బాబు అన్ని ప‌థ‌కాల‌కు త‌న పేరు పెట్టుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. వైఎస్ కూడా అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టార‌ని కానీ ఏనాడు త‌న పేరు పెట్టుకోలేద‌న్నారు. అయినా స‌రే ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాత ప్ర‌తి ఊరిలోనూ విగ్ర‌హాలు వెలిశాయ‌ని … ప్ర‌జ‌ల‌కు సేవ చేశారు కాబ‌ట్టే అది సాధ్య‌మైంద‌న్నారు. గ‌తంలో ఢిల్లీ సూల్తాన్ కూడా చంద్ర‌బాబు లాగే ఆలోచించార‌ని… తాను చ‌నిపోతే కొడుకులు స‌మాధి కూడా క‌ట్ట‌ర‌న్న ఉద్దేశంతో బ‌తికుండ‌గానే స‌మాధి క‌ట్టించుకున్నార‌ని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా అదే టైప్ అని అంబ‌టి ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు అనునిత్యం అభ‌ద్ర‌తాభావంతో బ‌తుకుతున్నార‌ని అన్నారు.

జ‌గ‌న్ దీక్ష‌ను విమ‌ర్శించిన భూమా నాగిరెడ్డిపైనా అంబ‌టి ఫైర్ అయ్యారు. భూమా నాగిరెడ్డికి సిగ్గుంటే ముందు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మాట్లాడాల‌న్నారు. జ‌గ‌న్ ఓటుతో, జ‌గ‌న్ నోటుతో గెలిచి తీరా చంద్ర‌బాబు పంచ‌న చేరి జ‌గ‌న్‌ను విమ‌ర్శించేందుకు భూమానాగిరెడ్డి సిగ్గుప‌డాల‌న్నారు. పౌరుషానికి ప్ర‌తికైన రాయ‌ల‌సీమ‌లో పుట్టిన భూమా నాగిరెడ్డి సిగ్గుంటే రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు రావాల‌ని స‌వాల్ చేశారు అంబ‌టి. రాజీనామా చేయ‌కుండా మైక్‌ల ముందు వ‌చ్చి మాట్లాడ‌డం మానుకోవాల‌న్నారు.

Click on Image to Read:

chandrababu-karunanidhi

MLA-Attar-Basha

jayalalitha

congress

mp-shiva-prasad

Mamata

alluarjun-1

ravindranath-reddy

bhuma-nagireddy

thota-narasimham

chevireddy

kodali-pardasaradi

ranga

modi-babu-meeting