కాంగ్రెస్ కంచుకోట బద్ధలు

కంచుకోట లాంటి అసోంలో కాంగ్రెస్ కుప్ప‌కూలింది. 15 ఏళ్ల పాటు అసోంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ను ఈసారి జ‌నం దారుణంగా తిర‌స్క‌రించారు. బీజేపీకి ప‌ట్టం క‌ట్టారు. 126 స్థానాలకు గాను బీజేపీ కూట‌మి ఏకంగా 80 స్థానాల‌ను సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 28 స్థానాల‌తో స‌రిపెట్టుకుంది. ఏఐడీయూఎఫ్ 10 స్థానాల్లో, ఇత‌రులు మ‌రో 10 స్థానాల్లో తిష్ట‌వేశారు.

వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్)పై తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారింది. అభివృద్ధి మంత్రంతో బీజేపీ.. అసోం గణపరిషత్, బోడో పార్టీలతో కలిసి బరిలోకి దిగింది. అసోం విజ‌యం బీజేపీకి బూస్ట్ నిచ్చింది. ఫ‌లితాల‌పై బీజేపీ నాయ‌క‌త్వం హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ఈశాన్య రాష్ట్రంలో ఓటమి కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బే.

Click on Image to Read:

Mamata

jayalalitha

alluarjun-1

mp-shiva-prasad

ravindranath-reddy

bhuma-nagireddy

thota-narasimham

chevireddy

kodali-pardasaradi

ranga

modi-babu-meeting