బాబు మోసానికి డీఎంకే బ‌లి

త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు క‌రుణానిధి చాలా త‌క్కువ అంచ‌నా వేసిన‌ట్టుగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని కంక‌ణం క‌ట్టుకుని బ‌రిలో దిగిన క‌రుణ పార్టీ ఏం చేస్తే అధికారం త‌మ‌ద‌వుతుంద‌న్న దానిపై పెద్ద రిసెర్చ్ చేసింది. ఇటీవల కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వ‌చ్చిన పార్టీల మేనిఫెస్టోల‌ను ప‌రిశీలించింది. అచ‌ర‌ణ సాధ్య‌మా కాదా అన్న‌ది ప‌క్క‌న‌పెట్టేసి కేవ‌లం గెలుపుకోసం కావాల్సిన పాయింట్ల కోస‌మే అన్వేషించింది. ఆ దారిలోనే చంద్ర‌బాబు ఎన్నిక‌ల చిట్టాను క‌రుణ ప‌రిశీలించారట. కరుణానిధి ఇలా చంద్రబాబును ఫాలో అయ్యారని ఏపీలోని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు గెలుపు అసాధ్యం అనుకున్న టీడీపీ చివ‌రకు ఎలా అధికారంలోకి వ‌చ్చింద‌న్న దానిపై కరుణ ప‌రిశీల‌న చేశారట.

చివ‌ర‌కు చంద్ర‌బాబు రుణ‌మాఫీ వ‌ల్లే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింద‌ని క‌రుణానిధి గుర్తించార‌ట.  రుణ‌మాఫీ అసాధ్య‌మ‌ని తెలిసినా, చంద్ర‌బాబు నిర్ణ‌యంతో ఏపీలో రైతాంగం స‌ర్వ‌నాశ‌నం అయిపోయింద‌ని అందరికీ తెలుసు. కానీ అధికారం కోసం క‌రుణ కూడా రుణ‌మాఫీ హామీని ప్ర‌క‌టించారు. రుణ‌మాఫీ త‌ర్వాత తాము కూడా చంద్ర‌బాబు త‌ర‌హాలోనే అధికారంలోకి వ‌స్తామ‌ని లెక్క‌లేసుకుని రిలాక్స్ అయ్యారు డీఎంకే నేత‌లు. తీరా చూస్తే త‌మిళ‌తంబీలు తాము వెర్రిప‌ప్ప‌లం కాద‌ని నిరూపించారు. త‌మిళ‌నాడులో ఉచిత హామీలు కామ‌నే అయినా మ‌రీ ఈ రేంజ్‌లో చెవిలో పూలు పెడితే న‌మ్మేందుకు అమాయ‌కులం కాద‌ని తీర్పు చెప్పారు.

మ‌రో విశేషం ఏమిటంటే. ఎన్నిక‌ల పోలింగ్ ముగియ‌గానే వివిధ స‌ర్వేలు కరుణ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పాయి. దీంతో ఏపీలోని చంద్ర‌బాబు బాకా మీడియా వెంట‌నే తొడ‌కొట్టింది. అస‌లు ఫ‌లితాలు రాక‌ముందే డీఎంకే అధికారంలోకి వ‌స్తున్నార‌ని స‌ర్వేలు చెప్పాయ‌ని … ఇందుకు కార‌ణం క‌రుణానిధి… చంద్ర‌బాబు ఐడియాల‌ను ఫాలో అవ్వ‌డ‌మేన‌ని పెద్ద‌పెద్ద క‌థ‌నాలు రాశాయి. చంద్ర‌బాబు రుణ‌మాఫీ అస్త్రాన్ని కరుణ అద్దెకు తీసుకుని పోరాడార‌ని అందుకే క‌రుణ‌కు ప‌ట్టం ఖాయ‌మైపోయింద‌ని క‌థ‌నాలు రాశాయి. సోష‌ల్ మీడియాలోనూ ఆ క‌థ‌నాల‌ను బాగా ప్ర‌చారం చేశాయి టీడీపీ అనుకూల మీడియా సంస్థ‌లు. తీరా చూస్తే క‌రుణా నిధికి టీడీపీ మీడియా చెప్పిన‌ట్టు సీఎం పీఠం ద‌క్కలేదు గానీ… వీల్ చైర్ ఫిక్స్ అయిపోయింది. పక్కోడి మోసాలను కూడా అద్దెకు తీసుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మొత్తం మీద త‌మిళ‌నాడు రైతులు, మ‌హిళ‌లు తెలివైన వారేన‌న్న‌మాట‌.

Click on Image to Read:

MLA-Attar-Basha

jayalalitha

congress

mp-shiva-prasad

Mamata

alluarjun-1

ravindranath-reddy

bhuma-nagireddy

thota-narasimham

chevireddy

kodali-pardasaradi

ranga

modi-babu-meeting