జూనియర్ రెండు రోజుల అజ్ఞాత వాసం

మరికొన్ని గంటల్లో జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అదిరిపోయే లెవెల్లో బయటు రాబోతోంది. రేపు తారక్ పుట్టినరోజు కాబట్టి… ఒక రోజు ముందుగానే ఫస్ట్ లుక్ విడుదల చేయాలని నిర్ణయించారు. అలా ఫ్యాన్స్ కు రెండు రోజుల పాటు సంతోషాన్నందించాలని తారక్ ఫిక్స్ అయ్యాడు. ఫస్ట్ లుక్ కోసం ప్రత్యేకంగా ఫొటోషూట్ కూడా చేశారు. అంతా బాగానే ఉంది కానీ… తన పుట్టినరోజున మాత్రం ఎన్టీఆర్ ఎవరికీ కనిపించడు. అవును… ఈరోజు ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నాడు తారక్. భార్య, కొడుకు, తల్లితో కలిసి ఎవరికీ చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాడు. ఓ 2 రోజుల పాటు కుటుంబసభ్యుల మధ్య గడిపి, తిరిగి ఫ్రెష్ గా సెట్స్ లోకి రావాలని తారక్ భావిస్తున్నాడు. 2 రోజుల విడిది కోసం తారక్… చెన్నై లేదా బెంగళూరు వెళ్లే అవకాశముందని చాలా మంది భావిస్తున్నారు. కొంతమంది మాత్రం హైదరాబాద్ లోని తన ఇంట్లోనే తారక్ ఉంటాడని, బయటకు మాత్రం రాడని చెబుతున్నారు. ఏది ఏమైనా… తన పుట్టినరోజున తారక్ మాత్రం ఎవరికీ కనిపించడు.