రిలీజ్ కు ముందు ఆ సీన్స్ కత్తిరించిన మహేష్

బ్రహ్మోత్సవం సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ ఆఫీసర్లు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. మూవీని ప్రత్యేకంగా కూడా మెచ్చుకున్నారు. అయినప్పటికీ బ్రహ్మోత్సవానికి కోత తప్పలేదు. సెన్సారోళ్లను కాదని ఈ సినిమాను కట్ చేసే అధికారం ఎవరికుంటుంది. ఇంకెవరికి… స్వయంగా మహేష్ బాబుకే అంత స్టామినా ఉంటుంది. అవును… మహేష్ బాబే బ్రహ్మోత్సవం సినిమాను కట్ చేశాడు. సినిమా నుంచి దాదాపు 10 నిమిషాల సన్నివేశాల్ని తీసి పడేశాడు. మహేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిర్మాత, దర్శకుడు ఎవరూ కాదనలేకపోయారు. ఇంతకీ సడెన్ గా… రిలీజ్ కు కొన్ని గంటల ముందు సినిమా నుంచి కొన్ని సీన్లు తీసేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది. స్వయంగా మహేష్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది…? తాజా సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం సినిమా 2 గంటల50 నిమిషాల నిడివి ఉందట. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాను రిలీజ్ చేసినట్టుగానే… అంతే నిడివితో బ్రహ్మోత్సవంను కూడా థియేటర్లలోకి వదిలేద్దామని నిర్మాత-దర్శకుడు ఫిక్స్ అయ్యారు. అయితే ఆఖరి నిమిషంలో మహేష్ రంగంలోకి ఎంటరయ్యాడు. సాంతం సినిమాను చూసిన మహేష్ బాబు… రెండో భాగంలో కామెడీ సీన్లు అన్నీ కత్తిరించేయమని ఆదేశించాడట.