Telugu Global
Cinema & Entertainment

50 ఏళ్ల బ్రహ్మచారికి పెళ్లి ఫిక్స్ అయింది...

ఈ మధ్యే హాఫ్ సెంచరీ కొట్టాడు సల్మాన్ ఖాన్. 50 ఏళ్లు వస్తేకానీ పెళ్లి చేసుకోనని అనుకున్నాడో ఏమో మొత్తానికి ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని కండలవీరుడు ఫిక్స్ అయ్యాడట. ఇదే విషయాన్ని ప్రీతిజింటా పెళ్లి రిసెప్షన్ లో సన్నిహితుల చెవిలో ఊదాడట. కొన్నేళ్లుగా రొమేనియాకు చెందిన లులియాతో సల్మాన్ డేటింగ్ చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఆ అమ్మాయినే పెళ్లాడబోతున్నట్టు సల్మాన్ అందరికీ చెప్పాడట. అంతేకాదు.. డిసెంబర్ 27న లులియాను పెళ్లి చేసుకోవాలని సల్మాన్ నిర్ణయించుకున్నట్టు […]

50 ఏళ్ల బ్రహ్మచారికి పెళ్లి ఫిక్స్ అయింది...
X
ఈ మధ్యే హాఫ్ సెంచరీ కొట్టాడు సల్మాన్ ఖాన్. 50 ఏళ్లు వస్తేకానీ పెళ్లి చేసుకోనని అనుకున్నాడో ఏమో మొత్తానికి ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని కండలవీరుడు ఫిక్స్ అయ్యాడట. ఇదే విషయాన్ని ప్రీతిజింటా పెళ్లి రిసెప్షన్ లో సన్నిహితుల చెవిలో ఊదాడట. కొన్నేళ్లుగా రొమేనియాకు చెందిన లులియాతో సల్మాన్ డేటింగ్ చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఆ అమ్మాయినే పెళ్లాడబోతున్నట్టు సల్మాన్ అందరికీ చెప్పాడట. అంతేకాదు.. డిసెంబర్ 27న లులియాను పెళ్లి చేసుకోవాలని సల్మాన్ నిర్ణయించుకున్నట్టు బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ వెబ్ సైట్ వెల్లడించింది. ఆశ్చర్యకరంగా… ఆ రోజున సల్మాన్ తన 51వ వడిలోకి ప్రవేశిస్తాడు. అదో రోజున లులియాను పెళ్లాడతాడంటూ బాలీవుడ్ కు చెందిన కొన్ని సైట్స్ వార్తలు ప్రచురించాయి. అయితే ఈ విషయంపై స్పందించేందుకు సల్మాన్ కుటుంబ సభ్యులెవరూ ఒప్పుకోలేదు. అలాగని వచ్చిన పుకార్లను ఖండించనూ లేదు. సల్మాన్ కు బాగా దగ్గరగా ఉండే బాలీవుడ్ సహచరులు మాత్రం ఈసారి సల్మాన్ పెళ్లి గ్యారెంటీ అంటూ చూచాయగా విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. మొత్తానికి 50ఏళ్ల వయసులో తన బ్రహ్మచర్యాన్ని వీడాలని సల్మాన్ ఫిక్స్ అయినట్టున్నాడు.
First Published:  19 May 2016 12:05 AM GMT
Next Story