Telugu Global
Cinema & Entertainment

కబాలి రాక ఖరారైంది

టీజర్ తో ఇప్పటికే సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు కబాలి. సినిమా విడుదల కోసం ఆలిండియా ఆశగా ఎదురుచూస్తోంది. ఈసారి రజనీకాంత్ నటవిశ్వరూపం వెండితెర నిండా పరుచుకుంటుందని బాగా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఎన్నాళ్లయినా సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడంతో…. ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్ కబాలి రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాడు. తమిళనాడు ఎన్నికలు పూర్తయినవెంటనే డేట్స్ ప్రకటిస్తానని చెప్పిన రజనీకాంత్… ఇచ్చిన మాట ప్రకారం… ఫలితాలు […]

కబాలి రాక ఖరారైంది
X
టీజర్ తో ఇప్పటికే సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు కబాలి. సినిమా విడుదల కోసం ఆలిండియా ఆశగా ఎదురుచూస్తోంది. ఈసారి రజనీకాంత్ నటవిశ్వరూపం వెండితెర నిండా పరుచుకుంటుందని బాగా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఎన్నాళ్లయినా సినిమా విడుదల తేదీని ప్రకటించకపోవడంతో…. ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్ కబాలి రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేశాడు. తమిళనాడు ఎన్నికలు పూర్తయినవెంటనే డేట్స్ ప్రకటిస్తానని చెప్పిన రజనీకాంత్… ఇచ్చిన మాట ప్రకారం… ఫలితాలు వెలువడిన వెంటనే కబాలి ఆగమనం ఎప్పుడనేది క్లారిటీ ఇచ్చేశాడు. ఓ వైపు జయలలిత గెలుపు ఖాయమని తెలిసిన వెంటనే… మరోవైపు కబాలి విడుదల తేదీని ప్రకటిస్తూ ప్రెస్ నోట్ విడుదలచేశాడు. ఈ సినిమాను జులై 1న విడుదల చేయనున్నారు. ఆడియో ను వచ్చేనెల మొదటి వారంలో విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. అంటే రజనీకాంత్ సినిమా విడుదలవ్వడానికి ఇంకా దాదాపు 40 రోజులు టైం ఉందన్నమాట. ఈ గ్యాప్ లో కబాలి టీజర్… ఇంటర్నెట్ లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
First Published:  19 May 2016 11:44 PM GMT
Next Story