Telugu Global
National

దేశ‌మంతా...గాంధీ నెహ్రూ లేనా!

నిన్నటి త‌రం బాలివుడ్ న‌టుడు రిషిక‌పూర్  మ‌రోసారి దేశంలోని ప్ర‌ముఖ స్థ‌లాల‌కు గాంధీ, నెహ్రూ పేర్ల‌ను పెట్ట‌డంపై ట్విట్ట‌ర్లో స్పందించారు.  ఒక్క న్యూఢిల్లీలోనే 64 ప్ర‌దేశాల‌కు గాంధీ, నెహ్రూ కుటుంబాల్లోని వ్య‌క్తుల పేర్లే ఉన్నాయంటూ ఆయా ప్ర‌దేశాల‌ను గ‌ర్తించిన ఒక మ్యాప్‌ని ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. ఈ వారం మొద‌ట్లో కూడా ఆయ‌న ఇదే విష‌యం మీద ట్విట్టర్లో ప్ర‌శ్న‌లు సంధించారు. దేశంలోని అన్ని ప్ర‌ముఖ స్థలాల‌కు  గాంధీ, నెహ్రూల పేర్లు త‌ప్ప ఇంకెవ‌రి పేర్లూ దొర‌క‌లేదా […]

నిన్నటి త‌రం బాలివుడ్ న‌టుడు రిషిక‌పూర్ మ‌రోసారి దేశంలోని ప్ర‌ముఖ స్థ‌లాల‌కు గాంధీ, నెహ్రూ పేర్ల‌ను పెట్ట‌డంపై ట్విట్ట‌ర్లో స్పందించారు. ఒక్క న్యూఢిల్లీలోనే 64 ప్ర‌దేశాల‌కు గాంధీ, నెహ్రూ కుటుంబాల్లోని వ్య‌క్తుల పేర్లే ఉన్నాయంటూ ఆయా ప్ర‌దేశాల‌ను గ‌ర్తించిన ఒక మ్యాప్‌ని ట్విట్ట‌ర్లో పోస్ట్ చేశారు. ఈ వారం మొద‌ట్లో కూడా ఆయ‌న ఇదే విష‌యం మీద ట్విట్టర్లో ప్ర‌శ్న‌లు సంధించారు. దేశంలోని అన్ని ప్ర‌ముఖ స్థలాల‌కు గాంధీ, నెహ్రూల పేర్లు త‌ప్ప ఇంకెవ‌రి పేర్లూ దొర‌క‌లేదా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టులు ఇలా అన్నింటికీ నెహ్రూ, గాంధీ కుటుంబాల్లోని వ్య‌క్తుల పేర్ల‌నే ఎందుకు పెడుతున్నార‌ని, సినిమా, పారిశ్రామిక రంగాల్లో ఉన్న‌ప్ర‌ముఖుల పేర్ల‌ను ఎందుకు పెట్ట‌కూడ‌దు… అని అడిగారు. జెఆర్‌డి టాటా, లతా మంగేష్క‌ర్‌, దిలీప్ కుమార్‌, దేవానంద్‌, అశోక్ కుమార్‌, అమితాబ్ బ‌చ్చ‌న్ లాంటి వారిపేర్ల‌ను పెట్ట‌వ‌చ్చు క‌దా…దీనిపై మీరేమంటారు అని ఆయ‌న ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు.

ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు అనే బ‌దులు, దానికి మ‌హాత్మాగాంధీ లేదా భ‌గ‌త్ సింగ్ పేరుని పెట్ట‌వ‌చ్చు క‌దా..లేదా నా పేరే పెట్ట‌వ‌చ్చు అంటూ ఆయ‌న పోస్ట్ చేశారు. భార‌త్‌కి పేరు తెచ్చిపెట్టిన రాజ్‌క‌పూర్‌ని ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోనే లేద‌న్నారు. అయితే కాంగ్రెస్‌వారు ఆయ‌న వాద‌న‌ల‌ను తొప్పి కొడుతూ. రిషీక‌పూర్ సంకుచితంగా ఆలోచిస్తున్నార‌ని, జాతి నిర్మాణంలో గాంధీలు చేసిన సేవ‌ల‌ను ఆయ‌న అర్థం చేసుకోవ‌టం లేద‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

First Published:  20 May 2016 1:00 AM GMT
Next Story