త‌న‌లోని ల‌క్ష‌ణాల‌ను చెప్పుకున్న చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మ‌రోసారి ఉరిమారు. చంద్ర‌బాబు ఇలా ఉర‌మ‌డాన్ని టీడీపీ నేత‌ల భావోద్వేగం అని కూడా అంటున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలో చేరిన సంద‌ర్భంగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు… త‌న‌కు భ‌య‌మంటే ఏంటో ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ద‌ని చెప్పుకున్నారు. ఒక్కసారంటే ఒక్క‌సారి కూడా జీవితంలో తాను త‌ప్పు చేయ‌లేద‌న్నారు. ప్రతీ మ‌నిషి ఏదో ఒక‌స‌య‌మంలో ఏదో ఒక‌దానికి భ‌య‌ప‌డ‌డం, తెలిసితెలియ‌క త‌ప్పు చేయ‌డం కామ‌న్‌. కానీ చంద్ర‌బాబు మాత్రం తాను ఈ రెండింటిని చూడ‌లేద‌ని చెప్ప‌డం చాలా గొప్ప‌విష‌య‌మే. అంతే కాదు…

త‌న‌ జీవితంలో రౌడీయిజం అంటే ఏమీటో చూడ‌లేద‌న్నారు. 35 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాన‌ని కుప్పంలో రౌడియిజం అన్న‌దే లేద‌ని బాబు చెప్పారు. తాను కుప్పం ఎప్పుడూ వెళ్ల‌న‌ని కానీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అభివృద్ధిని చూసి అక్క‌డి జ‌న‌మే గెలిపిస్తార‌ని చెప్పారు. త‌నను ఆడిపోసుకుంటే ఓట్లు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కంతో కొంద‌రు దీక్ష‌లు చేశారంటూ జ‌గ‌న్‌ను విమ‌ర్శించారు. కేసీఆర్‌ను విమ‌ర్శించ‌కుండా త‌న‌ను విమ‌ర్శిస్తే ఏమొస్తుంద‌ని ప్ర‌శ్నించారు బాబు. టీడీపీ ప్ర‌భుత్వాన్ని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయ‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. తాను మ‌ర్యాద‌గా ఉన్నంత వ‌ర‌కే అలాంటి వారి ఆట‌లు సాగుతాయ‌ని.. తాను క‌న్నెర్ర చేస్తే ఆట‌లు సాగ‌వ‌న్న విష‌యం గుర్తుంచుకోవాల‌న్నారు. తాను ప‌దేళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఎప్పుడూ కూడా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుప‌డ‌లేద‌న్నారు. కానీ ఇప్పుడు నాయ‌కులు అభివృద్దికి అడ్డుపడుతున్నార‌ని బాబు ఆరోపించారు. కాంగ్రెస్ నేత‌లు చెల్ల‌ని కాసుల‌ని బాబు చెప్పారు. అయినా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పక్కవాళ్లు పొగిడితే బాగుంటుంది గానీ… తనకు తానే గొప్పలు చెప్పుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది.  

Click on Image to Read:

ap-government-secret-GO's

tdp

lokesh-chandrababu-naidu

ambati

chandrababu-karunanidhi

MLA-Attar-Basha

jayalalitha

congress

mp-shiva-prasad

Mamata

bhuma-nagireddy