Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ విచిత్రం... విడాకులు తీసుకొని కలిసి కాపురం

ఎవరైనా విడాకులు ఎందుకు తీసుకుంటారు. విడివిడిగా బతకడానికే. అసలు విడాకులు అనే పదానికి అర్థమే అది. వేరుకుంపటి అని అర్థం. ఇలాంటి విడాకులు కేసులు బాలీవుడ్ లో ఈమధ్య ఎక్కువైపోయాయి. ప్రతి జంట విడాకులు కోరుకుంటోంది. ఇప్పుడిదో ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ ట్రెండ్ కు రివర్స్ ట్రెండ్ సృష్టించింది ఓ బాలీవుడ్ హాట్ జంట. ఇటీవలే కోర్టు నుంచి విడాకులు తీసుకున్న మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్… మళ్లీ కలిసిపోయారట. విడాకుల పత్రాలు చేతికందిన కొన్ని […]

బాలీవుడ్ విచిత్రం... విడాకులు తీసుకొని కలిసి కాపురం
X
ఎవరైనా విడాకులు ఎందుకు తీసుకుంటారు. విడివిడిగా బతకడానికే. అసలు విడాకులు అనే పదానికి అర్థమే అది. వేరుకుంపటి అని అర్థం. ఇలాంటి విడాకులు కేసులు బాలీవుడ్ లో ఈమధ్య ఎక్కువైపోయాయి. ప్రతి జంట విడాకులు కోరుకుంటోంది. ఇప్పుడిదో ట్రెండ్ అయిపోయింది. అయితే ఈ ట్రెండ్ కు రివర్స్ ట్రెండ్ సృష్టించింది ఓ బాలీవుడ్ హాట్ జంట. ఇటీవలే కోర్టు నుంచి విడాకులు తీసుకున్న మలైకా అరోరా, అర్బాజ్ ఖాన్… మళ్లీ కలిసిపోయారట. విడాకుల పత్రాలు చేతికందిన కొన్ని రోజుల్లోనే ఈ దంపతుల మనసు మారిపోయిందట. పైగా ఇంట్లోవాళ్లు బ్రెయిన్ వాష్ చేయడంతో తాము ఎంత తప్పుచేశామో తెలుసుకున్నారట. మరోవైపు సల్మాన్ ఖాన్ కూడా సీన్ లోకి ఎంటరై… మలైకా, అర్బాజ్ కు ఓ రేంజ్ లో క్లాస్ పీకాడట. దీంతో విడాకులు తీసుకున్న ఈ జంట, ఇప్పుడు మళ్లీ ఏకమైంది. ఒకే ఫ్లాట్ లో తిరిగి కాపురం కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా విడాకులు తీసుకున్న ఈ జంట తిరిగి మళ్లీ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చూడాలి. వీళ్లిద్దరూ మళ్లీ కలవడంతో పిల్లలు మాత్రం ఆనందపడుతున్నారు.
First Published:  19 May 2016 11:56 PM GMT
Next Story