జ‌గ‌న్‌పై ప‌డ్డ రేవంత్‌!

తిట్టే నోరు.. తిరిగే కాలు ఊరికే ఉండ‌వంటారు పెద్ద‌లు.. ఈ సామెత టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కి స‌రిగ్గా స‌రిపోతుంది. ప్ర‌త్య‌ర్థుల‌పై ఒంటికాలిపై లేచే ఆయ‌న మ‌రోసారి చెల‌రేగిపోయారు. వేదిక ఎక్కితే చాలు.. టీఆర్ ఎస్‌ను విమ‌ర్శించ‌కుండా ఉన్న సంద‌ర్భాలు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. త‌న‌ను ఓటుకు నోటు కేసులో అరెస్టు చేశార‌న్న క‌సో.. లేకుంటే నిజంగానే అధికార పార్టీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌న్న బ‌ల‌మైన న‌మ్మ‌క‌మో గానీ.. ఆయ‌న విమ‌ర్శ‌ల్లో మాత్రం ప‌దును త‌గ్గ‌డం లేదు. ఒక్కోసారి ఆయ‌న విమ‌ర్శ‌లు వ్య‌క్తిగ‌తంగా.. దూష‌ణ‌లదాకా వెళుతున్న సంగ‌తి తెలిసిందే! కొంత‌కాలంగా ఆయ‌న చేసే ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాయి. అస‌లు ఆయ‌న అందుకేనే తిట్ల‌దండ‌కం చూస్తుంటే..  సంచ‌ల‌నం కోస‌మే అలా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తోంది. మైకు చేతిలో ప‌డితే శివాలెత్తిపోతున్నాడు. ఇలా నోరుపారేసుకునే రేవంత్ ఈసారి జ‌గ‌న్‌పై ప‌డ్డాడు. అయితే, ఆయ‌న‌పై రేవంత్ చేసిన‌ ఈవ్యాఖ్య‌లు విన్న ప‌లు పార్టీల నేత‌లు పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్నారు. రేవంత్‌లో ఈ హ‌స్య‌పు కోణాన్ని తాము ఎంజాయ్ చేస్తున్నామ‌ని అంటున్నారు. 
జ‌గ‌న్ దీక్ష కేసీఆర్ ఆదేశాల‌తోనా..!
సంచ‌ల‌నం చేయాల‌ని చూశాడో… లేకుంటే జోక్ చేయాల‌ని అనుకున్నాడో గానీ.. రేవంత్ ఈసారి భారీ ఆరోప‌ణ చేశాడు. రోజూ కేసీఆర్ కుటుంబాన్నే తిడితే ఏంబాగుంటుంది? అనుకున్నాడేమో.. ఈసారి వైసీపీ అధినేత జ‌గ‌న్ మీద ప‌డ్డాడు. పాల‌మూరు ప్రాజెక్టు ను వ్య‌తిరేకిస్తూ..  వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇటీవ‌ల క‌ర్నూలులో చేప‌ట్టిన‌ జ‌ల‌దీక్ష  కేసీఆర్ ఆదేశాల‌తోనే జ‌రిగింద‌ని నిజామాబాద్ మినీ మ‌హానాడులో ఆరోపించాడు.
టీడీపీని బ‌ల‌హీనం చేయ‌డానికి వైసీపీ – టీఆర్ ఎస్ ఆడుతున్న మైండ్‌గేమ్‌లో జ‌ల‌దీక్ష భాగ‌మ‌ని ఆరోపించాడు. అంతేనా.. వైసీపీ ఎంపీల‌కు కేసీఆర్ వేల‌కోట్ల కాంట్రాక్టులు క‌ట్ట‌బెట్టాడ‌ని కూడా ఆరోపించేశాడు. పాల‌మూరు ప్రాజెక్టు విష‌యంలో మాట‌ల‌ క‌త్తులు దూసుకుంటున్న వైసీపీ – టీఆర్ ఎస్ నేత‌లు ఈ వాఖ్య‌లు విని పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతున్న‌ట్లు తెలిసింది. ఎ
ప్పుడూ ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల‌తో దాడి చేసే రేవంత్‌లో ఈ హ్యాస్య‌పుకోణం ఉంద‌ని త‌మ‌కు తెలియ‌ద‌ని ఎద్దేవా చేస్తున్నారు. రేవంత్ వేసిన ఇంత పెద్ద జోక్‌ను తాము ఇదివ‌ర‌కెప్పుడూ విన‌లేద‌ని, న‌వ్వ‌లేక త‌మ పొట్ట‌లు ప‌గిలిపోతున్నాయ‌ని న‌వ్వి.. న‌వ్వి చెబుతున్నారు. రేవంత్ వేసిన జోక్‌ను తాము బాగా ఎంజాయ్ చేస్తున్నామ‌న్నారు.  జ‌రుగుతున్న ప‌రిణామాలు బ‌ట్టి చూస్తే.. రేవంత్ వ్యాఖ్య‌ల్ని అంద‌రూ లైట్ తీసుకున్న‌ట్లే క‌నిపిస్తోంది. 

Click on Image to Read:

chandrababu-naidu

ap-government-secret-GO's

tdp

lokesh-chandrababu-naidu

ambati

chandrababu-karunanidhi

MLA-Attar-Basha

jayalalitha

congress

mp-shiva-prasad

Mamata

bhuma-nagireddy