టీడీపీ మ‌హానాడులో అసాంఘిక కార్య‌క‌లాపాలుంటాయా?

త‌ప్పు చేసే వారు ఇప్పుడు చ‌ట్టాల‌కు భ‌య‌ప‌డుతున్నారో లేదో గానీ, మీడియాను చూసి మాత్రం కొద్దిమేర జంకుతున్నారు. తాగి కారు న‌డిపే సెల‌బ్రేటీల నుంచి కుంభ‌కోణాల‌కు తెగ‌బ‌డే నాయ‌కుల వ‌ర‌కు మీడియాను చూసి కొద్దిగా జాగ్ర‌త్త‌గా బ‌తుకుతున్నారు. త‌ప్పు చేయ‌ని వారు మీడియాకే కాదు… ఈ దేశంలో ఏ వ్య‌వ‌స్థ‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. కానీ మీడియా జాకీల‌తో పైకి ఎదిగి… అదే మీడియా జాకీల సాయంతో న‌డుస్తున్న టీడీపీ కూడా ఇప్పుడు మీడియాను చూసి భ‌య‌ప‌డుతోంది. అది కూడా డ‌జ‌ను టీవీ చాన‌ళ్లు, రెండు ప్ర‌ధాన ప‌త్రిక‌ల అండ ఉండి కూడా కేవ‌లం ఒక‌టి రెండు మీడియా సంస్థ‌ల‌ను బాబు పార్టీ వ‌ణుకుతోంది. అంద‌రికీ తెలిసేలా జ‌ర‌గాల్సిన పార్టీ మ‌హానాడును కూడా కొన్ని టీవీ చాన‌ళ్ల‌ను అనుమ‌తించ‌కుండా ముసుగేసుకుని నిర్వ‌హించాల‌ని టీడీపీ నిర్ణ‌యించ‌డం ఆశ్చ‌ర్య‌కరంగానే ఉంది.

ఈనెల 27 నుంచి తిరుప‌తి వేదిక‌గా మూడు రోజుల పాటు మ‌హానాడు జ‌రుగ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి అన్ని మీడియా సంస్థ‌ల‌కు అనుమ‌తిస్తున్నారు. ముందే ప్ర‌చారం అంటే ప‌డిచ‌చ్చే పార్టీ క‌దా…అందుకే మీడియా ప్ర‌తినిధుల‌ను బాగా చూసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే కేసీఆర్‌కు చెందిన టీ న్యూస్ ఛాన‌ల్, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌తో పాటు జ‌గ‌న్‌కు చెందిన సాక్షి మీడియా ప్ర‌తినిధుల‌ను మ‌హానాడులో అడుగుపెట్ట‌నివ్వ‌ద్దు అంటూ నిర్వాహకుల‌కు పార్టీ నాయ‌క‌త్వం ఏకంగా లిఖిత‌పూర్వ‌క ఆదేశాలు జారీ చేసింది. మీడియా క‌మిటీ చైర్మ‌న్ గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు చూసి అంతా అవాక్క‌వుతున్నారు.

మ‌హానాడు అసాంఘిక కార్య‌క్ర‌మం కాదు క‌దా… అందులో జ‌రిగే కార్య‌క్ర‌మాల‌కు సాక్షి, టీ న్యూస్ వ‌చ్చి ప్ర‌సారం చేసినా ఏం కొంప‌లు మునుగుతాయ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక్క సాక్షి, టీ న్యూస్ మాత్ర‌మే టీడీపీ త‌ప్పుల‌ను ఎండ‌గ‌ట్టే మీడియా సంస్థ‌ల‌ని టీడీపీ నేత‌లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారా?. మిగిలిన టీవీ ఛాన‌ళ్లు అన్నీ త‌మ‌కు బాకా ఊదే డ‌బ్బాలేన‌ని టీడీపీకి న‌మ్మ‌కం కుదిరిందా?. అయితే ఇక్క‌డ మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అంశం ఏమిటంటే కొద్దికాలం క్రితం తెలంగాణ‌లో రెండు ఛాన‌ళ్ల ప్ర‌సారాలు నిలిపివేస్తే ఇదే టీడీపీ నేత‌లు ప్ర‌జాస్వామ్యం, తొక్కా తోట‌కూర అంటూ పెద్ద‌పెద్ద హోట‌ళ్ల‌లో స‌మావేశాలు పెట్టి మాట్లాడారు.

తెలంగాణ‌లో ఈ రెండు ఛాన‌ళ్లు ఇప్పుడు కేసీఆర్‌కు స‌రెండ‌ర్ అయిపోవ‌డం.. ఛాన‌ళ్ల ప్రసారాలు తిరిగి మొద‌ల‌వ‌డం కూడా జ‌రిగిపోయింది. అదే వేరే విష‌యం. కానీ మాట‌కు ముందు మీడియా అంటేచాలా గౌర‌వం, ప్ర‌జాస్వామ్యం అంటే విప‌రీత‌మైన ల‌వ్ అని చెప్పుకునే బాబు పార్టీ అస‌లు విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఇలా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయినా త‌ప్పు చేయ‌ని వారు ప్ర‌త్య‌ర్థి మీడియా సంస్థ‌ల‌ను చూసి భ‌య‌ప‌డాలి గానీ.. టీడీపీ మ‌హానాడు టీ న్యూస్, సాక్షిని చూసి ఎందుకు భ‌య‌ప‌డుతోందో!. నోట్… చంద్ర‌బాబు జాకీ ఛాచాన‌ళ్లు మాత్రం వైసీపీ, టీఆర్ఎస్ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రై అక్క‌డ మ‌ర్యాద‌లు అందుకుని వ‌స్తుంటాయి.

Click on Image to Read:

ap-government-secret-GO's

lokesh-chandrababu-naidu

ambati

chandrababu-karunanidhi

MLA-Attar-Basha

jayalalitha

congress

mp-shiva-prasad

Mamata

bhuma-nagireddy