Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ కు ముందు కోశారు... ఇప్పుడు అనుభవిస్తున్నారు....

బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు ముందు ఆఖరి నిమిషంలో సొంత సెన్సార్ కార్యక్రమాలు పెట్టుకున్నారు. నిడివి ఎక్కువైందని ఒకసారి, ఫ్లో దెబ్బతింటోందని మరోసారి, కామెడీ సింక్ అవ్వడం లేదని ఇంకోసారి సినిమాను నరుక్కుంటూ వెళ్లారు. ఫలితంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవం అతుకుల బొంతలా తయారైందనేది ప్రేక్షకుల తీర్పు. ఎమోషన్ పండాల్సిన సీన్లలో కూడా జర్క్ లొచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టేశాయి. సినిమా మరో 2 రోజుల్లో విడుదల అవుతుందనగా… బ్రహ్మోత్సవంపై ఓ పుకారు వచ్చింది. సినిమా నిడివి […]

రిలీజ్ కు ముందు కోశారు... ఇప్పుడు అనుభవిస్తున్నారు....
X
బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు ముందు ఆఖరి నిమిషంలో సొంత సెన్సార్ కార్యక్రమాలు పెట్టుకున్నారు. నిడివి ఎక్కువైందని ఒకసారి, ఫ్లో దెబ్బతింటోందని మరోసారి, కామెడీ సింక్ అవ్వడం లేదని ఇంకోసారి సినిమాను నరుక్కుంటూ వెళ్లారు. ఫలితంగా థియేటర్లలోకి వచ్చిన తర్వాత బ్రహ్మోత్సవం అతుకుల బొంతలా తయారైందనేది ప్రేక్షకుల తీర్పు. ఎమోషన్ పండాల్సిన సీన్లలో కూడా జర్క్ లొచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టేశాయి. సినిమా మరో 2 రోజుల్లో విడుదల అవుతుందనగా… బ్రహ్మోత్సవంపై ఓ పుకారు వచ్చింది. సినిమా నిడివి దాదాపు 2గంటల 45 నిమిషాలు ఉంది కాబట్టి… అర్జెంట్ గా దాన్ని తగ్గించాలనే కార్యక్రమాన్ని మహేష్ బాబు తన భుజాలపైకి ఎత్తుకున్నాడనే ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజముందో తెలీదు కానీ… ఆ కటింగులే సినిమా కొంప ముంచాయనేది అందరి అభిప్రాయం. నిజానికి శ్రీకాంత్ అడ్డాల సినిమాలంటేనే కాస్త సీరియల్ టైపులో, నిడివి కూడా ఎక్కువగా ఉంటాయి. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. అలాఅని ఎలా పడితే అలా కత్తిరిస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. కనీసం నెక్ట్స్ సినిమాకైనా శ్రీకాంత్ అడ్డాల ఈ యాంగిల్ లో కాస్త ఆలోచించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిదని చాలామంది సూచిస్తున్నారు.
First Published:  21 May 2016 12:22 AM GMT
Next Story