Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో బన్నీ హీరోయిన్

ఎవరూ ఊహించని హీరోయిన్ కు అవకాశమిచ్చి సెన్సేషన్ సృష్టించాడు చిరంజీవి. సరైనోడులో బన్నీ సరసన నటించిన క్యాథరీన్ థ్రెసాను తన 150వ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి టోటల్ టాలీవుడ్ షాక్ అయింది. అయితే ఇక్కడ క్యాథరీన్ ను తీసుకున్నది ఫస్ట్ హీరోయిన్ గా కాదు. మొదటి హీరోయిన్ గా ఇప్పటికే అనుష్కను ఎంపిక చేశారు. నయనతార స్థానంలో ఆ సెలక్షన్ పూర్తయింది. సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం క్యాథరీన్ ను […]

చిరంజీవి సినిమాలో బన్నీ హీరోయిన్
X
ఎవరూ ఊహించని హీరోయిన్ కు అవకాశమిచ్చి సెన్సేషన్ సృష్టించాడు చిరంజీవి. సరైనోడులో బన్నీ సరసన నటించిన క్యాథరీన్ థ్రెసాను తన 150వ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి టోటల్ టాలీవుడ్ షాక్ అయింది. అయితే ఇక్కడ క్యాథరీన్ ను తీసుకున్నది ఫస్ట్ హీరోయిన్ గా కాదు. మొదటి హీరోయిన్ గా ఇప్పటికే అనుష్కను ఎంపిక చేశారు. నయనతార స్థానంలో ఆ సెలక్షన్ పూర్తయింది. సినిమాలో సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం క్యాథరీన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. బన్నీ నటించిన సరైనోడు సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన చిరంజీవి… అందులో క్యాథరీన్ లుక్స్ కు ఫిదా అయిపోయారట. అందుకే తన సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారట. మరోవైపు ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుదిదశకు చేరుకుంది. జులై 9 నుంచి విదేశాల్లో రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. మొదట పాటలతో షూటింగ్ మొదలుపెడతారు. తర్వాత హైదరాబాద్ వచ్చి టాకీపార్ట్ పూర్తిచేస్తారు. వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు రామ్ చరణఅ నిర్మాతగా వ్యవహరిస్తాడు.
First Published:  21 May 2016 12:22 AM GMT
Next Story