Telugu Global
Others

ఈటెలపై కేసు కొట్టివేత‌

పోలీసుల‌ను దూషించిన కేసులో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ కి ఊర‌ట ల‌భించింది. స‌రైన ఆధారాలు లేని కార‌ణంగా న్యాయ‌స్థానం కేసును కొట్టివేసింది. ఈ కేసు పూర్వాప‌రాలు ఒక‌సారి ప‌రిశీలిద్దాం… 2014 మార్చి 11న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేంద‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ వెళుతున్నారు. ఆయ‌న కారు పెంబ‌ర్తి పోలీస్ స్టేష‌న్ కు చేరుకోగానే.. పోలీసులు కారు ఆపారు. దీంతో తాను ఎమ్మెల్యేన‌ని త‌న కారు ఎందుకు ఆపారు? […]

ఈటెలపై కేసు కొట్టివేత‌
X

పోలీసుల‌ను దూషించిన కేసులో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద‌ర్ కి ఊర‌ట ల‌భించింది. స‌రైన ఆధారాలు లేని కార‌ణంగా న్యాయ‌స్థానం కేసును కొట్టివేసింది. ఈ కేసు పూర్వాప‌రాలు ఒక‌సారి ప‌రిశీలిద్దాం… 2014 మార్చి 11న టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేంద‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ వెళుతున్నారు. ఆయ‌న కారు పెంబ‌ర్తి పోలీస్ స్టేష‌న్ కు చేరుకోగానే.. పోలీసులు కారు ఆపారు. దీంతో తాను ఎమ్మెల్యేన‌ని త‌న కారు ఎందుకు ఆపారు? అని ప్ర‌శ్నించారు. త‌న‌ఖీలు జ‌రుగుతున్నాయి..ఎవ‌రైనా ఆపాల్సిందేన‌ని అక్క‌డున్న కానిస్టేబుల్ స‌మాధాన‌మిచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఈటెల స‌ద‌రు కానిస్టేబుల్ తో వాగ్వాదానికి దిగిన‌ట్లు సమాచారం. అక్క‌డున్న పోలీసులు విష‌యాన్ని ఫోన్‌లో వ‌రంగ‌ల్ రూర‌ల్‌ ఎస్పీకి స‌మాచార‌మిచ్చారు. ఆయ‌న ఆదేశాల మేర‌కు ఈటెల‌పై కేసు న‌మోదు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న కానిస్టేబుల్‌ను యూజ్ లెస్ ఫెలో అని దూషించాడన్ని ఎఫ్ ఐఆర్‌లో పేర్కోన్నారు. అప్ప‌టి నుంచి ఈ కేసు విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఈనెల 3న ఈటెల స్థానిక న్యాయ‌స్థానికి సైతం హాజ‌రు కాగా కేసు శుక్ర‌వారానికి వాయిదా ప‌డింది. స‌రైన సాక్ష్యాధారాలు లేని కార‌ణంగా ఈ కేసును కొట్టి వేస్తున్న‌ట్లు జ‌డ్జి తీర్పునిచ్చారు. దీంతో ఈటెల రాజేంద‌ర్ ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  21 May 2016 12:02 AM GMT
Next Story