Telugu Global
Cinema & Entertainment

అవును... మీరు విన్నది నిజమే...

తన సినిమాకు సంబంధించి వరుణ్ తేజ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈమధ్య కాలంలో ఈ కుర్రహీరోపై ఓ పుకారు షికారు చేసింది. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ తేజ ఓ సినిమా చేయబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఆరా తీయగా… అది నిజమేనని ప్రకటించాడు వరుణ్ తేజ. అంతేకాదు… సినిమా సంగతులు కూడా ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నాడు. సున్నితమైన ప్రేమకథలకు పెట్టింది పేరైన కమ్ముల, వరుణ్ తేజ కోసం అలాంటిదే […]

అవును... మీరు విన్నది నిజమే...
X
తన సినిమాకు సంబంధించి వరుణ్ తేజ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈమధ్య కాలంలో ఈ కుర్రహీరోపై ఓ పుకారు షికారు చేసింది. సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వరుణ్ తేజ ఓ సినిమా చేయబోతున్నాడంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ఆరా తీయగా… అది నిజమేనని ప్రకటించాడు వరుణ్ తేజ. అంతేకాదు… సినిమా సంగతులు కూడా ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నాడు. సున్నితమైన ప్రేమకథలకు పెట్టింది పేరైన కమ్ముల, వరుణ్ తేజ కోసం అలాంటిదే ఓ కథను రాసుకున్నాడట. వరుణ్ తేజ ఇప్పటివరకు సెన్సిబుల్ లవ్ స్టోరీ చేయలేదు… శేఖర్ కమ్ముల చలవతో ఆ కోరిక కూడా తీరిపోతుంది. వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. వెంకటేశ్వర్ ఆర్ట్స్ పతాకంపై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. అయితే మూవీలో వరుణ్ తేజ సరసన నటించే భామ ఎవరనేది మాత్రం ఇంకా పక్కా కాలేదు. ఆ విషయాన్ని కూడా వారం రోజుల్లో వెల్లడిస్తానని స్వయంగా వరుణ్ తేజ మాటిచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు.
First Published:  21 May 2016 9:10 PM GMT
Next Story