Telugu Global
Cinema & Entertainment

బన్నీకి ఆ ఊరిలో పనేంటి...?

సాధారణంగా షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే హీరోలు ఎవరైనా జమ్ముకశ్మీర్ కు వెళ్తుంటారు. మిగతా సమయాల్లో సేదతీరాలంటే విదేశాలకు చెక్కేస్తుంటారు. లేదంటే తమ ఫాంహౌసుల్లోనే కాలక్షేపం చేస్తుంటారు. కానీ బన్నీ మాత్రం తన సినిమా షూటింగ్ లేకపోయినప్పటికీ.. ఈసారి జమ్ముకశ్మీర్ టూర్ ఫిక్స్ చేశాడు. కొడుకు అయాన్, భార్య స్నేహతో కలిసి త్వరలోనే జమ్ముకశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నాడు. నిజానికి విదేశాల్లోని మంచుకొండల కంటే కశ్మీర్ లోయలు ఎంతో బెటర్. విదేశాల్లో ఉండే వాతావరణం కంటే మంచి వాతావరణం […]

బన్నీకి ఆ ఊరిలో పనేంటి...?
X
సాధారణంగా షూటింగ్ లు ఉన్నప్పుడు మాత్రమే హీరోలు ఎవరైనా జమ్ముకశ్మీర్ కు వెళ్తుంటారు. మిగతా సమయాల్లో సేదతీరాలంటే విదేశాలకు చెక్కేస్తుంటారు. లేదంటే తమ ఫాంహౌసుల్లోనే కాలక్షేపం చేస్తుంటారు. కానీ బన్నీ మాత్రం తన సినిమా షూటింగ్ లేకపోయినప్పటికీ.. ఈసారి జమ్ముకశ్మీర్ టూర్ ఫిక్స్ చేశాడు. కొడుకు అయాన్, భార్య స్నేహతో కలిసి త్వరలోనే జమ్ముకశ్మీర్ వెళ్లాలని అనుకుంటున్నాడు. నిజానికి విదేశాల్లోని మంచుకొండల కంటే కశ్మీర్ లోయలు ఎంతో బెటర్. విదేశాల్లో ఉండే వాతావరణం కంటే మంచి వాతావరణం కశ్మీర్ లో ఉంటుంది. అంతెందుకు… ప్రపంచంలోనే మోస్ట్ రొమాంటిక్ టూరిస్ట్ స్పాట్స్ లో జమ్ముకశ్మీర్ కు రెండో స్థానం దక్కిందంటే… లోయ అందాల గొప్పదనాన్ని అర్థంచేసుకోవచ్చు. అందుకే బన్నీ ఈసారి స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాల్ని పక్కనపెట్టి చక్కగా జమ్ముకశ్మీర్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడట. కనీసం ఓ 3 రోజులు అక్కడ ఉండి, తిరిగొచ్చిన తర్వాత తన కొత్త సినిమాపై నిర్ణయం తీసుకుంటాడట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించాలా లేక లింగుస్వామి తో కలిసి సెట్స్ పైకి వెళ్లాలా అనే విషయాన్ని బన్నీ ఇంకా నిర్ణయించుకోలేదట.

Click on Image to Read:

rgv-maheshbabu

brahmotsavan-movie-review

chiru-150-movie

vijayakanth-pawan

maheshbabu

ntr

First Published:  22 May 2016 1:02 AM GMT
Next Story