Telugu Global
NEWS

సోనియాపై వెంకయ్య ప్రసంశలు.. ముందు చూపేనా?

వెంకయ్య ఒక తెలివైన నేత. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పొగిడిపడేయంలో దిట్ట. ఆ మధ్య ప్రధాని మోదీని ఏకంగా దైవదూత, దేవుడు అని పొగిడి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కూడా చివాట్లు తిన్నారు. ఇప్పుడు హఠాత్తుగా సోనియాను వెంకయ్య ఆకాశానికెత్తేశారు. కాంగ్రెస్‌ నాయకత్వ మార్పు అనే అంశంపై స్పందిస్తూ … సోనియా వల్లే కాంగ్రెస్ ఐక్యంగా ఉందని చెప్పారు. ఆ పార్టీని ఏకతాటి మీద నడిపే శక్తి సోనియాకు మాత్రమే ఉందన్నారు. వారసత్వ రాజకీయాలను తాను ఆమోదించనప్పటికీ సోనియా లేకపోతే […]

సోనియాపై వెంకయ్య ప్రసంశలు.. ముందు చూపేనా?
X

వెంకయ్య ఒక తెలివైన నేత. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పొగిడిపడేయంలో దిట్ట. ఆ మధ్య ప్రధాని మోదీని ఏకంగా దైవదూత, దేవుడు అని పొగిడి ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కూడా చివాట్లు తిన్నారు. ఇప్పుడు హఠాత్తుగా సోనియాను వెంకయ్య ఆకాశానికెత్తేశారు. కాంగ్రెస్‌ నాయకత్వ మార్పు అనే అంశంపై స్పందిస్తూ … సోనియా వల్లే కాంగ్రెస్ ఐక్యంగా ఉందని చెప్పారు. ఆ పార్టీని ఏకతాటి మీద నడిపే శక్తి సోనియాకు మాత్రమే ఉందన్నారు. వారసత్వ రాజకీయాలను తాను ఆమోదించనప్పటికీ సోనియా లేకపోతే కాంగ్రెస్ లేదని మాత్రం చెప్పగలనన్నారు. కాంగ్రెస్‌లో ఐక్యతకు సోనియా నాయకత్వమే కారణమని కితాబిచ్చారు. ఆ శక్తి సోనియాకు మాత్రమే ఉందన్నారు. సోనియాను వ్యక్తిగతంగా ఇంతా పొడిగేసి చివర్లో… ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ విజయం సాధించలేకపోయిందని చెప్పారు.

సోనియా నాయకత్వాన్ని వెంకయ్య ప్రశంసించడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇలా ఉన్నత స్థానంలో ఉన్న వారిని, ఎప్పటికైనా శాసించే స్థాయికి వచ్చే వ్యక్తులను ఇలా పొగడడం వెంకయ్యకు అలవాటేనని చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకవేళ భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తన వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, తన వ్యవహారాలపై ఎలాంటి విచారణను లేకుండా చేసుకునేందుకే వెంకయ్య ఇలా తెలివిగా నడుచుకుంటారని చెబుతున్నారు. అప్పట్లో వాజ్‌పేయ్, అద్వానీలు ఫామ్‌లో ఉన్నప్పుడు కూడా వెంకయ్య వారిద్దరిని ఓ రేంజ్‌లో పొగిడేవారని గుర్తు చేస్తున్నారు.

Click on Image to Read:

chandrabau-naidu

lokesh-chandrababu-naidu

chalasani-manikyalarao

rgv-maheshbabu

mudragada-padmanabham,-Hars

tg-venkatesh

brahmotsavan-movie-review

narayana

jyothula1

jyotula

kothapalli-subbarayudu

balaram-gottipati

chandrababu-naidu-comments-

bonda

vijayakanth-pawan

First Published:  22 May 2016 4:13 AM GMT
Next Story