Telugu Global
National

భ‌జ‌రంగ్… ద‌ళానికి ఆయుధ శిక్ష‌ణ!

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ యువ విభాగం భ‌జ‌రంగ్ దళ్, త‌న కార్య‌క‌ర్త‌ల‌కు  ఆయుధ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.  క‌త్తులు, తుపాకులు, లాఠీల‌ను వాడ‌టంలో త‌ర్ఫీదు పొందుతున్న వీరు హిందువుల‌ను, హిందూ సోద‌రేత‌రుల నుండి కాపాడుతార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల అయోధ్య‌లో ఒక శిక్ష‌ణా కేంద్రాన్ని నిర్వ‌హించారు. జూన్ ఐదు వ‌ర‌కు ఇలాంటి క్యాంపుల‌ను సుల్తాన్‌పూర్‌, గోర‌ఖ్‌పూర్‌, ఫిలిబిత్‌, నోయిడా, ఫ‌తేపూర్‌లలో నిర్వ‌హించ‌నున్న‌ట్టుగా స‌మాచారం. ఇప్ప‌టికే భ‌జ‌రంగ్ ద‌ళ్ ప‌లు అల్ల‌ర్లకు, మ‌త‌ప‌రంగా మైనారిటీలుగా ఉన్న‌వారిపై హింస‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న‌ది. […]

భ‌జ‌రంగ్… ద‌ళానికి ఆయుధ శిక్ష‌ణ!
X

విశ్వ‌హిందూ ప‌రిష‌త్ యువ విభాగం భ‌జ‌రంగ్ దళ్, త‌న కార్య‌క‌ర్త‌ల‌కు ఆయుధ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది. క‌త్తులు, తుపాకులు, లాఠీల‌ను వాడ‌టంలో త‌ర్ఫీదు పొందుతున్న వీరు హిందువుల‌ను, హిందూ సోద‌రేత‌రుల నుండి కాపాడుతార‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల అయోధ్య‌లో ఒక శిక్ష‌ణా కేంద్రాన్ని నిర్వ‌హించారు. జూన్ ఐదు వ‌ర‌కు ఇలాంటి క్యాంపుల‌ను సుల్తాన్‌పూర్‌, గోర‌ఖ్‌పూర్‌, ఫిలిబిత్‌, నోయిడా, ఫ‌తేపూర్‌లలో నిర్వ‌హించ‌నున్న‌ట్టుగా స‌మాచారం. ఇప్ప‌టికే భ‌జ‌రంగ్ ద‌ళ్ ప‌లు అల్ల‌ర్లకు, మ‌త‌ప‌రంగా మైనారిటీలుగా ఉన్న‌వారిపై హింస‌కు పాల్ప‌డింద‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న‌ది. భ‌జ‌రంగ్ దళ్ గో సంర‌క్ష‌ణ‌కు సంబంధించిన కార్య‌క‌లాపాల్లోనూ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న‌ది.

First Published:  23 May 2016 2:04 AM GMT
Next Story