మధ్యలోనే బిచాన ఎత్తేసిన ఎమ్మెల్యే అత్తార్.. నవ్వుకున్న టీడీపీ నేతలు

ఇటీవలే టీడీపీలో చేరిన కదిరి వైసీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషాను టీడీపీ నేతలు కాలేజ్ సీనియర్లు జూనియర్లను టీజ్‌ చేసినట్టుగా చేస్తున్నారు. కదిరి మినీమహానాడుకు వస్తే భౌతిక దాడులు తప్పవని కదిరి టీడీపీ ఇన్‌చార్జ్ కందికుంట ప్రసాద్ వర్గం హెచ్చరించడంతో అత్తార్‌ బాషా ఆ సమావేశానికి హాజరుకాలేదు. సోమవారం అనంతపురంలో జరిగిన మినీమహానాడులోనూ అత్తార్‌ బాషాకు అదే తరహా ట్రీట్‌మెంట్ ఎదురైంది. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు తిరిగే రాజకీయ పొద్దుతిరుగుడు పువ్వులు తయారయ్యాయని వేదికపైనే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నిజంగా కష్టపడిన వారు ఎక్కడో ఉంటే .. రాజకీయ పొద్దు తిరుగుడు పువ్వులు మాత్రం అందంగా తయారై ముందు వరుసలో కూర్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. ఈవ్యాఖ్యలు కదిరి ఎమ్మెల్యే అత్తార్ బాషాను ఉద్దేశించి చేసినవేనని అందరికీ అర్థమైపోయింది. పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలతో ఖంగుతిన్న అత్తార్ బాషా … మినీ మహానాడు నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అత్తార్ బాషా అలా వెళ్లిపోవడంతో పయ్యావుల, కందికుంట ప్రసాద్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అత్తార్ బాషాను కావాలనే టీడీపీ నేతలు టార్గెట్ చేసినట్టు ఉందని ఆయన అనుచరులు వాపోతున్నారు.

Click on Image to Read:

vijayawada-tdp-coporaters

adinarayana-reddy

rajareddy

payyavula-kasab

prof-nageshwar-rao

gottipati-jagan

jyotula-nehru

MLA-Satish-Reddy

mudragada

prakasha-tdp

brahmotsavan-movie-review