Telugu Global
Cinema & Entertainment

మెగా అందగాడి రొమాంటిక్ స్టోరీస్

మెగాహిరోలలో వరుణ్ తేజ్ రూటే సెపరేటు అని అతని మొదటి సినిమా ‘ముకుందా’ తోనే మనకు అర్థం అయ్యిపోయింది. తర్వాత వచ్చిన క్రిష్ ‘కంచె’ ఆ విషయం రూఢీ చేసింది. మధ్యలో ‘లోఫర్’ వచ్చినా మళ్ళీ డిఫరెంట్ రూట్ పట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సారి బ్యాక్ టు బ్యాక్ అన్నీ రొమాంటిక్ డ్రామాలే చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ అనే రొమాంటిక్ కామెడీలో తన కామిక్ టైమింగ్ సెన్స్ మనకు […]

మెగా అందగాడి రొమాంటిక్ స్టోరీస్
X

మెగాహిరోలలో వరుణ్ తేజ్ రూటే సెపరేటు అని అతని మొదటి సినిమా ‘ముకుందా’ తోనే మనకు అర్థం అయ్యిపోయింది. తర్వాత వచ్చిన క్రిష్ ‘కంచె’ ఆ విషయం రూఢీ చేసింది. మధ్యలో ‘లోఫర్’ వచ్చినా మళ్ళీ డిఫరెంట్ రూట్ పట్టాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సారి బ్యాక్ టు బ్యాక్ అన్నీ రొమాంటిక్ డ్రామాలే చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్’ అనే రొమాంటిక్ కామెడీలో తన కామిక్ టైమింగ్ సెన్స్ మనకు చూపించే పనిలో మునిగి ఉన్నాడు.

ఆ తర్వాత చెయ్యబోయే సినిమా కూడా రొమాంటిక్ కామెడీనే. ఇది వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఉంటుంది. ఆ తరువాత‌ సినిమా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సాఫ్ట్ ప్రేమ కథ ఉంటుందని … అందులో వరుణ్ .ఎన్.ఆర్.ఐ. గా చేయబోతున్నాడు.. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాకపోయినా.. ఆమె క్యారెక్టర్ మాత్రం తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి.. వరుణ్ అంతా రొమాంటిక్ కధల‌ బాట పట్టాడు. అయినా మెగా హీరోలలో అందరికన్నా అందగాడు అన్న పేరున్న వరుణ్‌కి రొమాంటిక్ కధలు బాగుంటాయేమో.

First Published:  24 May 2016 12:24 AM GMT
Next Story