Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవం చూసి పండగ చేసుకుంటున్న వెంకీ ఫ్యాన్స్

బ్రహ్మోత్సవం సినిమాకు వెంకటేశ్ అభిమానులకు సంబంధం లేదు. కానీ బ్రహ్మోత్సవం మూవీని చూసి వెంకటేశ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో… వెంకీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నిజానికి వివాదాలకు దూరంగా ఉండే వెంకీ ఫ్యాన్స్.. ఇలా వ్యవహరిచడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ దీనివెనక బలమైన కారణం ఒకటి ఉంది. అప్పట్లో ఇదే శ్రీకాంత్ అడ్డాల మహేష్, వెంకీని పెట్టి సీతమ్మవాకిట్లో సిరిమల్లెెచెట్టు అనే సినిమా […]

బ్రహ్మోత్సవం చూసి పండగ చేసుకుంటున్న వెంకీ ఫ్యాన్స్
X
బ్రహ్మోత్సవం సినిమాకు వెంకటేశ్ అభిమానులకు సంబంధం లేదు. కానీ బ్రహ్మోత్సవం మూవీని చూసి వెంకటేశ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో… వెంకీ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. నిజానికి వివాదాలకు దూరంగా ఉండే వెంకీ ఫ్యాన్స్.. ఇలా వ్యవహరిచడం పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కానీ దీనివెనక బలమైన కారణం ఒకటి ఉంది. అప్పట్లో ఇదే శ్రీకాంత్ అడ్డాల మహేష్, వెంకీని పెట్టి సీతమ్మవాకిట్లో సిరిమల్లెెచెట్టు అనే సినిమా తీశాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా మంచి హిట్ సాధించింది. అయితే ఆ సినిమా విజయంలో మేజర్ పార్ట్ మహేష్ కే వెళ్లిపోయింది. సినిమాలో మహేష్ తో సమానంగా వెంకీ కూడా ఉన్నాడు. కానీ విశ్లేషకులతో పాటు… ప్రచార సాధనాలు కూడా ఎక్కువ క్రెడిట్ మహేష్ కే ఇచ్చేశాయి. మహేష్ లేకపోతే సినిమా ఇంత హిట్ అయ్యేది కాదని ఊదరగొట్టాయి. మళ్లీ ఇన్నేళ్లకు అదే బ్యానర్ లో శ్రీకాంత్ అడ్డాల, మహేష్ నుపెట్టి బ్రహ్మోత్సవం తీశాడు. ఇది అట్టర్ ఫ్లాప్ దిశగా దూసుకుపోతోంది. అందుకే వెంకీ ఫ్యాన్స్ కు అంత ఆనందం. అప్పటి కోపాన్ని ఇప్పుడు చల్లార్చుకున్నారన్నమాట.
Click on Image to Read:
brahmotsavan-movie-review
mahesh-babu-ntr
First Published:  23 May 2016 11:36 PM GMT
Next Story