Telugu Global
Cinema & Entertainment

అవసరాల దర్శకత్వంలో నాని

దర్శకుల ఎంపిక విషయంలో నానిది ఎప్పుడు డిఫరెంట్ స్టయిల్. కథ బాగుంటే చాలు దర్శకుడు ఎవరనేది ఎప్పుడూ పట్టించుకోడు. అందుకే నాని ఎంపిక చేసుకునే దర్శకులంతా భలే గమ్మత్తుగా ఉంటారు. సముత్తరఖని, ఇంద్రగంటి. నందితారెడ్డి, మారుతి, హను రాఘవపూడి… ఇలా నాని వర్క్ చేసిన దర్శకుల జాబితా చూస్తే అంతా కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తదనాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడు నాని. త్వరలోనే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అవసరాల కేవలం […]

అవసరాల దర్శకత్వంలో నాని
X
దర్శకుల ఎంపిక విషయంలో నానిది ఎప్పుడు డిఫరెంట్ స్టయిల్. కథ బాగుంటే చాలు దర్శకుడు ఎవరనేది ఎప్పుడూ పట్టించుకోడు. అందుకే నాని ఎంపిక చేసుకునే దర్శకులంతా భలే గమ్మత్తుగా ఉంటారు. సముత్తరఖని, ఇంద్రగంటి. నందితారెడ్డి, మారుతి, హను రాఘవపూడి… ఇలా నాని వర్క్ చేసిన దర్శకుల జాబితా చూస్తే అంతా కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడు కొత్తదనాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాడు నాని. త్వరలోనే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అవసరాల కేవలం కామెడీ ఆర్టిస్ట్ మాత్రమే కాదు… మంతి కథకుడు, అంతకుమించి మంచి దర్శకుడు కూడా. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా నానితో కలిసి సినిమా పక్కా చేసుకున్నాడు. వాస్తవానికి నాని-అవసరాల ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. అష్టాచమ్మా అనే సినిమాతోనే ఇద్దరి ఎంట్రీ జరిగింది. తర్వాత ఎవరి దారిలో వాళ్లు నడిచారు. ఇప్పుడు మరోసారి అవసరాల దర్శకుడిగా, నాని హీరోగా ఆ కాంబినేషన్ గమ్మత్తుగా సెట్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా నాని ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
First Published:  24 May 2016 10:52 PM GMT
Next Story