Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ అలా కూడా పడింది..

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా 40కోట్ల లాస్ మిగులుస్తుందని అంచనా. దీంతో ఆ ప్రభావం మహేష్ నటించనున్న నెక్ట్స్ సినిమాపై పడింది. వచ్చే నెల నుంచి మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా… తెలుగు-తమిళ-హిందీ బాషల్లో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. అయితే బ్రహ్మోత్సవం దెబ్బతో ఈ మూవీ బడ్జెట్ పై భారీ […]

బ్రహ్మోత్సవం ఎఫెక్ట్ అలా కూడా పడింది..
X
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా 40కోట్ల లాస్ మిగులుస్తుందని అంచనా. దీంతో ఆ ప్రభావం మహేష్ నటించనున్న నెక్ట్స్ సినిమాపై పడింది. వచ్చే నెల నుంచి మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు మహేష్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా… తెలుగు-తమిళ-హిందీ బాషల్లో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. అయితే బ్రహ్మోత్సవం దెబ్బతో ఈ మూవీ బడ్జెట్ పై భారీ కోత పడింది. ప్రాజెక్టుపై నిర్మాతలు వెనక్కి తగ్గడంతో… హీరో, దర్శకుడు చర్చించి.. బడ్డెట్ ను ఏకంగా 50-60కోట్లకు కుదించినట్టు తెలుస్తోంది. పైగా ఇందులో కూడా మహేష్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తుండడంతో.. .బడ్జెట్ పై బాగానే కసరత్తు చేశారు. గతంలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. అంచనాకు మించిన బడ్జెట్ తో వచ్చిన ఆగడు అట్డర్ ఫ్లాప్ అయింది. దీంతో శ్రీమంతుడు విషయంలో బడ్జెట్ బాగా కుదించారు. అది హిట్టయింది. తాజాగా బ్రహ్మోత్సవానికి భారీగా ఖర్చుపెట్టారు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. సో.. ఇప్పుడు మురుగదాస్ సినిమాకు బడ్జెట్ బాగా తగ్గిస్తున్నారు. సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే.. మహేష్-మురుగదాస్ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే.
First Published:  24 May 2016 10:57 PM GMT
Next Story