Telugu Global
Cinema & Entertainment

మనసులో మాట చెప్పింది... ఇప్పుడు వెనక్కి తగ్గింది

తను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని సమంత బయటకు చెప్పేసింది. తను తెలుగులో ఓ హీరో అని కూడా చెప్పింది. అంతేకాదు… అతడు తెలుగులో ఓ అగ్రహీరో కుమారుడని కూడా పరోక్షంగా హింట్స్ ఇచ్చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులుకే మరో ప్రకటతో మనముందుకొచ్చింది. దయచేసి తను చెప్పేంత వరకు ఎవరూ మీడియాలో తన పెళ్లి గురించి రాతలు, కథనాలు రాయొద్దని విజ్ఞప్తిచేసింది. దీనికి కారణం సదరు హీరో తల్లిదండ్రుల్ని చూసి సమంత భయపడుతోందట. అందుకే […]

మనసులో మాట చెప్పింది... ఇప్పుడు వెనక్కి తగ్గింది
X
తను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని సమంత బయటకు చెప్పేసింది. తను తెలుగులో ఓ హీరో అని కూడా చెప్పింది. అంతేకాదు… అతడు తెలుగులో ఓ అగ్రహీరో కుమారుడని కూడా పరోక్షంగా హింట్స్ ఇచ్చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొన్ని రోజులుకే మరో ప్రకటతో మనముందుకొచ్చింది. దయచేసి తను చెప్పేంత వరకు ఎవరూ మీడియాలో తన పెళ్లి గురించి రాతలు, కథనాలు రాయొద్దని విజ్ఞప్తిచేసింది. దీనికి కారణం సదరు హీరో తల్లిదండ్రుల్ని చూసి సమంత భయపడుతోందట. అందుకే కొద్దిగా వెనకడుగు వేస్తోందనే ప్రచారం సాగుతోంది. తన చేతినిండా సినిమాలు ఉన్నా కూడా వాళ్లింట్లో ఒకే అంటే కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లిపీటలెక్కాలని భావిస్తోంది. వారివైపు నుండి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదట. హీరో కూడా ఎక్కడా బయటకు లీక్ కాకుండా చూసుకుంటున్నాడు. అయితే వాళ్లింట్లో మాత్రం చెప్పాడట. కానీ పెళ్లికి ఒప్పుకోవడం లేదనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇద్దరిపై కోపంగా ఉండటంతో సమంత కూడా భయపడిపోతుందట.గతంలో సిద్దార్థ్ ను ప్రేమించి, విషయం పెళ్లి వరకు వచ్చిన తర్వాత ఆ రిలేషన్ షిప్ వీడిపోయింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి తొందరగానే బయటపడిన సమంత… ఇప్పుడు ఓ అగ్ర కథానాయకుడి కొడుకుతో డేటింగ్ చేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే.
First Published:  24 May 2016 10:51 PM GMT
Next Story