Telugu Global
NEWS

పార్క్ హయత్‌పై బాబు కాపురం ఎఫెక్ట్?

బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉంటూ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో కాపురం పెట్టడంపై చంద్రబాబు తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటూనే ఇలా లక్షలు పోసి అత్యంత ఖరీదైన హోటల్‌లో సేదతీరడంపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పార్క్‌హయత్‌ హోటల్‌లో చంద్రబాబు కుటుంబం ఉండడంతో కొందరు వీఐపీలు ఆ హోటల్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని సమాచారం. సీఎం కుటుంబం కొలువై ఉండడంతో సహజంగానే నిఘా ఉంటుంది. భద్రత చర్యల్లో భాగంగా అది తప్పదు. హోటల్‌కు ఎవరొస్తున్నారు.. వారు ఎవరు […]

పార్క్ హయత్‌పై బాబు కాపురం ఎఫెక్ట్?
X

బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా ఉంటూ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో కాపురం పెట్టడంపై చంద్రబాబు తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందంటూనే ఇలా లక్షలు పోసి అత్యంత ఖరీదైన హోటల్‌లో సేదతీరడంపై అన్ని వైపులనుంచి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పార్క్‌హయత్‌ హోటల్‌లో చంద్రబాబు కుటుంబం ఉండడంతో కొందరు వీఐపీలు ఆ హోటల్‌కు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని సమాచారం. సీఎం కుటుంబం కొలువై ఉండడంతో సహజంగానే నిఘా ఉంటుంది. భద్రత చర్యల్లో భాగంగా అది తప్పదు.

హోటల్‌కు ఎవరొస్తున్నారు.. వారు ఎవరు అన్న దానిపై రహస్యంగానే నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉంటాయని చెబుతున్నారు. ఈనేపథ్యంలో హోటల్‌కు వచ్చే కొందరు ముఖ్యులు కాస్త ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. సెలబ్రెటీలు కూడా ఎందుకొచ్చిన బాధ అన్నట్టుగా ఉంటున్నారు. ఒక విధంగా సీఎం కుటుంబం హోటల్‌లో తిష్టవేయడంతో పార్కు హయత్‌ను ఇష్టపడేవారు కూడా తెలియని అసౌకర్యానికి లోనవుతున్నారని చెబుతున్నారు.

పైగా.. సీఎం కుటుంబం పార్క్‌ హయత్‌లో కాపురం పెట్టాక మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. దీంతో సెలబ్రెటీలు, ముఖ్యులు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు.అయితే పార్కు హయత్‌ హోటల్‌కు ఉన్నపేరు ప్రతిష్ఠల కారణంగా వ్యాపారానికి వచ్చిన ఇబ్బంది ఏమీలేదని చెబుతున్నారు. ఎందుకంటే దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖులు ఇక్కడే బస చేసేందుకు తొలిప్రాధాన్యత ఇవ్వడమే కారణమని చెబుతున్నారు.

Click on Image to Read:

venkaiah-naidu

babu-bus

madhu

mahesh-bramosavam1

gottipati-jagan

chandrababu-park-hyatt-hote

rajareddy

revanth-reddy

attar-chand-basha

lokesh

sakshi-tv

vijayawada-tdp-coporaters

adinarayana-reddy

payyavula-kasab

prof-nageshwar-rao

prakasha-tdp

angoorlatha

First Published:  25 May 2016 12:23 AM GMT
Next Story