Telugu Global
Cinema & Entertainment

ఇలియానా అతని ఆదరణ కోసం కాచుకుంది

ఒకప్పుడు తన సన్నని నడుముతో సౌత్ మూవీస్‌ని ఒక ఊపు ఊపింది ఇలియానా. లావుగా..బొద్దుగా ఉన్న హీరోయిన్ల మధ్య సన్నజాజీ తీగలాగా మెరిసిపోయింది. కాని ఒక్క హిందీ ఛాన్స్ వచ్చేసరికి… తెలుగు, తమిళ సినిమాలు వెగటయిపోయాయి. బాలివుడ్‌లో ఫ్లాపుల మీద ఫ్లాపులు వచ్చి.. అమ్మడి కెరీర్ అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ… సౌత్ సినిమాలవైపు కన్నెత్తి చూడడానికి ఇష్టపడడం లేదీ భామ. అక్కడ ఇప్పుడు ఇలియానా చేతిలో కేవలం ఒకే ఒక్క మూవీ ఉంది. అది ‘రుస్తుం ‘. ఇది […]

ఇలియానా అతని ఆదరణ కోసం కాచుకుంది
X

ఒకప్పుడు తన సన్నని నడుముతో సౌత్ మూవీస్‌ని ఒక ఊపు ఊపింది ఇలియానా. లావుగా..బొద్దుగా ఉన్న హీరోయిన్ల మధ్య సన్నజాజీ తీగలాగా మెరిసిపోయింది. కాని ఒక్క హిందీ ఛాన్స్ వచ్చేసరికి… తెలుగు, తమిళ సినిమాలు వెగటయిపోయాయి. బాలివుడ్‌లో ఫ్లాపుల మీద ఫ్లాపులు వచ్చి.. అమ్మడి కెరీర్ అగమ్యగోచరంగా ఉన్నప్పటికీ… సౌత్ సినిమాలవైపు కన్నెత్తి చూడడానికి ఇష్టపడడం లేదీ భామ. అక్కడ ఇప్పుడు ఇలియానా చేతిలో కేవలం ఒకే ఒక్క మూవీ ఉంది. అది ‘రుస్తుం ‘. ఇది 1950 ల నాటి కథ అట.

బాలివుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్. ఆమె ఆశలన్నీ ఇక అక్షయ్ కుమార్ సినిమాపైనే పెట్టుకుంది. సౌత్ నుండి వచ్చిన హీరోయిన్స్ ఆదరించే కొద్ది మందిలో అక్షయ్ ఒక్కడు. ఈ సినిమా హిట్ అయితే… ఇతర హీరోల మూవీస్ ఏమోగాని అక్షయ్ నుండి మరో ఆఫర్ వచ్చే అవకాశాలు ఎక్కువే ఇలియానాకి. హీరోయిన్లని రిపీట్ చేసే అలవాటుంది అక్షయ్ కి. అందుకే తనకున్న ఖాళీ సమయమంతా వెచ్చించి ఈ సినిమా ప్రమోషన్ పనిలో పడింది. ఎలాగూ…. ఈ సినిమా విడుదల వరకు ఇంకో సినిమా చేతిలో లేదు. కనీసం అక్షయ్ అయినా ఆమె ఆశ తీరుస్తాడేమో చూడాలి.

First Published:  25 May 2016 1:46 AM GMT
Next Story