Telugu Global
NEWS

బాంబు పేల్చిన కోదండ‌రాం.. ఉలిక్కిప‌డ్డ‌ గులాబీ నేత‌లు

తెలంగాణ జేఏసీ క‌న్వీన‌ర్ కోదండ‌రాం బాంబు పేల్చారు. అవ‌స‌ర‌మైతే.. తెలంగాణ‌లో రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలంటూ ప‌లువురు కోరుతున్నార‌ని వెల్ల‌డించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ జేఏసీ ఆవిర్భావం నుంచి క‌న్వీనర్‌గా ఉంటున్న కోదండ‌రాం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం పెద్ద‌దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణ‌లో అధికార పార్టీని స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌డంలో తెలుగుదేశం, కాంగ్రెస్ విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న వేళ కోదండ‌రాం నోటివెంట వ‌చ్చిన ఈ మాట నిజంగా సంచ‌ల‌న‌మే. తెలంగాణ పోరుకు చిరునామాగా కేసీఆర్ నిలిస్తే.. […]

బాంబు పేల్చిన కోదండ‌రాం.. ఉలిక్కిప‌డ్డ‌ గులాబీ నేత‌లు
X
తెలంగాణ జేఏసీ క‌న్వీన‌ర్ కోదండ‌రాం బాంబు పేల్చారు. అవ‌స‌ర‌మైతే.. తెలంగాణ‌లో రాజ‌కీయ ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలంటూ ప‌లువురు కోరుతున్నార‌ని వెల్ల‌డించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ జేఏసీ ఆవిర్భావం నుంచి క‌న్వీనర్‌గా ఉంటున్న కోదండ‌రాం ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం పెద్ద‌దుమారాన్నే రేపుతున్నాయి. తెలంగాణ‌లో అధికార పార్టీని స‌మ‌ర్ధంగా ఎదుర్కోవ‌డంలో తెలుగుదేశం, కాంగ్రెస్ విఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్న వేళ కోదండ‌రాం నోటివెంట వ‌చ్చిన ఈ మాట నిజంగా సంచ‌ల‌న‌మే. తెలంగాణ పోరుకు చిరునామాగా కేసీఆర్ నిలిస్తే.. తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌తిపౌరుడు భాగ‌స్వామ్యం అయ్యేలా చేసింది మాత్రం ముమ్మాటికీ కోదండ‌రామే! ఈ మాట‌లే గ‌న‌క వాస్త‌వ‌రూపం దాలిస్తే.. కేసీఆర్ పార్టీకి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు.
కోదండ‌రాం వ్యాఖ్య‌లు ఇటు గులాబీపార్టీలోనూ చ‌ర్చానీయాంశంగా మారాయి. ఉద్య‌మ‌పార్టీగా ఉన్న టీఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్రం అనంత‌రం పూర్తి స్థాయి రాజ‌కీయ పార్టీగా అవ‌త‌రించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జాక్షేత్రంలో జేఏసీ ఎన్నిక‌ల‌కు వెళితే.. త‌ప్ప‌కుండా అది టీఆర్ ఎస్ ఓటుబ్యాంకుకు చిల్లు పెడుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కోదండ‌రాం వ్యాఖ్య‌ల‌తో గులాబీ నేత‌లు ఉలిక్కి ప‌డుతున్నారు. వారి ఆందోళ‌న‌కు కార‌ణం ఉంది. టీఆర్ ఎస్ ఉద్య‌మపార్టీ అయినా అది రాజ‌కీయ పార్టీనే. దానికి కార్య‌క‌ర్త‌లు, అభిమానులు మాత్ర‌మే ఉంటారు. కానీ, జేఏసీ ఇందుకు విరుద్ధం. దానికి అభిమానుల‌తోపాటు, విద్యావంతులు, ఉద్యోగులు, మేథావులు, నిర‌క్ష‌రాస్యులు, కూలీలు, కార్మికులు కూడా జేఏసీ వెంట ఇప్ప‌టికీ ఉన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ ఎస్ బంద్ పిలుపిస్తే.. 9 జిల్లాలో బంద్ సంపూర్ణంగా జ‌రిగేది. కానీ హైద‌రాబాద్ లో మాత్రం అంతంతంగానే ఉండేది. అదే జేఏసీ బంద్ పిలుపు ఇస్తే 10 జిల్లాల జ‌న‌జీవ‌నం స్తంభించింది. కేవ‌లం జేఏసీ పిలుపునందుకున్న ప్ర‌జ‌లు నెల‌ల‌పాటు స‌మ్మెలు, రాస్తారోకోలు, వంటా-వార్పులతో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. విచిత్రం ఏంటంటే.. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు గులాబీ నేతలు అతిథులుగా వ‌చ్చారు. ఇటీవ‌ల ఉద్యోగ సంఘాలు జేఏసీ నుంచి వైదొలిగినా.. ఇప్ప‌టికీ దానికి సానుభూతి ప‌రులు ఉన్నారు. ఒక‌వేళ‌.. కోదండ‌రాం అన్నంత ప‌ని చేస్తే.. టీఆర్ ఎస్ నేత‌ల గొంతులో ప‌చ్చివెల‌క్కాయ ప‌డ్డ‌ట్టే!
First Published:  26 May 2016 2:04 AM GMT
Next Story