Telugu Global
Cinema & Entertainment

నితిన్-సమంత సినిమాకు లైన్ క్లియర్ అయింది

బుధవారం నుంచి అ..ఆ సినిమాకు అఫీషియల్ గా ప్రమోషన్ స్టార్టయింది. నితిన్-సమంత కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇదే గ్యాప్ లో సినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో ఎలాంటి కట్స్ చెప్పలేదు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశం, డైలాగ్ సెన్సార్ అధికారులకు కనిపించలేదు. తన మార్క్ మరోసారి నిలబెట్టుకున్నాడు త్రివిక్రమ్. చక్కటి కుటుంబకథా చిత్రానికి, కామెడీ, ఎమోషన్ జోడించి అ..ఆ సినిమాను తెరకెక్కించాడు. ఆడియో […]

నితిన్-సమంత సినిమాకు లైన్ క్లియర్ అయింది
X

బుధవారం నుంచి అ..ఆ సినిమాకు అఫీషియల్ గా ప్రమోషన్ స్టార్టయింది. నితిన్-సమంత కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలు మార్కెట్లోకి వచ్చేశాయి. ఇదే గ్యాప్ లో సినిమా సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు క్లీన్-యు సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమాలో ఎలాంటి కట్స్ చెప్పలేదు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశం, డైలాగ్ సెన్సార్ అధికారులకు కనిపించలేదు. తన మార్క్ మరోసారి నిలబెట్టుకున్నాడు త్రివిక్రమ్. చక్కటి కుటుంబకథా చిత్రానికి, కామెడీ, ఎమోషన్ జోడించి అ..ఆ సినిమాను తెరకెక్కించాడు. ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్టు… ఈ సినిమాతో మూలాలు వెదుక్కోవచ్చని త్రివిక్రమ్ అన్నాడు. అది నిజమే అనిపిస్తుంది. ఎఁదుకంటే… త్రివిక్రమ్ కెరీర్ ప్రారంభంలో రాసిన డైలాగులు, ఆ సెన్సిబిలిటీ అ..ఆ సినిమాలో కనిపిస్తుంది. అప్పట్లో మాటల రచయితగా చిరునవ్వుతో, నువ్వునాకు నచ్చావ్, మన్మధుడు లాంటి సినిమాలుక త్రివిక్రమ్ ఎలాంటి మాటలు అందించాడో…. ఆ మేజిక్ ను మరోసారి అ..ఆ లో చూడొచ్చని సినీపండిట్స్ చెబుతున్నారు. జూన్ 2న విడుదలకాబోతున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చాడు.

Click on Image to Read:

brahmotsavam

pawan

janatha-garage-movie

First Published:  25 May 2016 11:00 PM GMT
Next Story