Telugu Global
Cinema & Entertainment

బిచ్చగాడి పాలైన బ్రహ్మోత్సవం

బ్రహ్మోత్సవం సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. సినిమా బడ్జెట్ కూడా మామూలు విషయం కాదు. దాదాపు 75కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా 85కోట్ల రూపాయలు చేసినట్టు సమాచారం. ఇంత భారీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బిచ్చగాడి పాలైంది. అవును… బ్రహ్మోత్సవం సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోయాయి. ఎంత దారుణం అంటే… అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నోళ్లు కూడా […]

బిచ్చగాడి పాలైన బ్రహ్మోత్సవం
X

బ్రహ్మోత్సవం సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. సినిమా బడ్జెట్ కూడా మామూలు విషయం కాదు. దాదాపు 75కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా 85కోట్ల రూపాయలు చేసినట్టు సమాచారం. ఇంత భారీగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బిచ్చగాడి పాలైంది. అవును… బ్రహ్మోత్సవం సినిమాకు మొదటి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. రెండో రోజు నుంచే వసూళ్లు పడిపోయాయి. ఎంత దారుణం అంటే… అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నోళ్లు కూడా డబ్బులు పోతే పోయాయి అనుకొని థియేటర్లకు వెళ్లడం మానేశారు. దీంతో వారం తిరిగేసరికి బ్రహ్మోత్సవం ఫ్లాప్ అనేది డిక్లేర్ అయింది. ఈ వార్… బిచ్చగాడికి వరంగా మారింది. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ఓ డబ్బింగ్ సినిమా పేరే ఈ బిచ్చగాడు. ఎలాంటి అంచనాలు లేకుండా గల్లీ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… స్లో పాయిజన్ లా జనాలకు ఎక్కేసింది. ప్రతి ఒక్కరు సినిమా చాలా కొత్తగా ఉంది అనేవాళ్లే. దీంతో బ్రహ్మోత్సవం ఎత్తేసి చాలామంది తమ థియేటర్లలో బిచ్చగాడికి చోటిచ్చారు.

Click on Image to Read:

pawan

janatha-garage-movie

A-AA-Censor-Report

First Published:  25 May 2016 11:02 PM GMT
Next Story