విజయసాయిరెడ్డిని విమర్శించి నాలుక్కరుచుకున్న మంత్రులు

విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించడంపై మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా స్పందించారు. ఆర్థిక అక్రమాలకు పాల్పడిన విజయసాయిరెడ్డిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. సాయిరెడ్డికి ఓటేసే విషయంపై ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు. సాక్షి మీడియాకు అవసరమైన వందల కోట్లు సమకూర్చింది విజయసాయిరెడ్డేనని మంత్రులు విమర్శించారు. అయితే హఠాత్తుగా మీడియా ప్రతినిధుల నుంచి మంత్రులు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో మంత్రులిద్దరూ నీళ్లు నమిలారు.

విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ … మరి బ్యాంకులను మోసం చేసి ఒక దశలో అరెస్ట్ వారెంట్ కూడా అందుకున్న సుజనా చౌదరిని కేంద్రమంత్రిగా,రాజ్యసభ సభ్యుడిగా ఎలా కొనసాగిస్తోందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో మంత్రులు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. చివరకు సుజనా విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ దాటవేసి  వెళ్లిపోయారు. ఒకవిధంగా విజయసాయిరెడ్డిని విమర్శించడం ద్వారా సుజనా చౌదరి రాజ్యసభ స్థానానికి నీళ్లు తెచ్చేపని చేయబోయారు మంత్రులిద్దరు.

అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్టార్‌ హోటల్‌లో ఉంటే తప్పేంటని పుల్లారావు ప్రశ్నించారు. ఒకముఖ్యమంత్రి రోజుకు రెండు లక్షలు అద్దె చెల్లించి ఉండకూడదా అని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు ఫాంహౌజ్‌ కోసం ప్రభుత్వాన్ని సొమ్మును ఖర్చు చేసిన మాటకూడా వాస్తవమేనని పుల్లారావు చెప్పారు.

Click on Image to Read:

ysrcp-mla's

jalil-khan

vijayasai-reddy

chintamaneni-prabhakar1

trs

vijayasai-reddy-YS-Jagan

venkaiah-naidu

Kidnap

Defection-Act-1

onions

karanam-balaram

babu park hyatt

chandrababu-controversial

ap-cm-chandrababu-naidu

chandrababu-naidu

babu-bus

mahesh-bramosavam1

gottipati-jagan

chandrababu-park-hyatt-hote

rajareddy