సాయిరెడ్డిపై ఎంతో ఒత్తిడి తెచ్చారు, ఎన్నో ఆశలు చూపారు – జగన్

వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయరెడ్డి పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో జగన్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ ..సాయిరెడ్డి గురించి మనసులోని మాట చెప్పారు. కేసులు పెట్టిన సమయంలో తనకు వ్యతిరేకంగా నిలబడాలని విజయసాయిరెడ్డిపై ఎంతో ఒత్తిడి తెచ్చారని, ఎన్నో ఆశలు చూశారని కానీ విజయసాయిరెడ్డి సత్యాన్ని నమ్ముకున్నారని, నైతికతకు కట్టుబడి ఉన్నారని ప్రశంసించారు.

విజయసాయిరెడ్డి లొంగకపోవడంతోనే ఆయన్ను కూడా కేసుల్లో ఇరికించారని జగన్‌ పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. విజయసాయిరెడ్డి తొలినుంచి కూడా మనతోనే ఉన్నారని ,నైతికతకు కట్టుబడ్డారని అందుకే విశ్వసనీయులకు సరైనస్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే సాయిరెడ్డి పేరును రాజ్యసభ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నానని జగన్ చెప్పారు. జగన్ ప్రతిపాదనకు పార్టీ నేతలంతా మద్దతు పలికారు. చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలు చేస్తూ మానవ సంబంధాలను డబ్బుతో కొనేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు వారిని నట్టేట ముంచడం ఖాయమన్నారు జగన్‌.వైసీపీ ఒక్క మాటకోసం పుట్టిన పార్టీ అన్నారు.

Click on Image to Read:

Kidnap

Defection-Act-1

onions

karanam-balaram

babu park hyatt

chandrababu-controversial

venkaiah-naidu

ap-cm-chandrababu-naidu

chandrababu-naidu

babu-bus

mahesh-bramosavam1

gottipati-jagan

chandrababu-park-hyatt-hote

rajareddy