చకోరీ సాంగ్ అదిరిపోయింది

సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు సంబంధించి మేకర్స్ మరో సాంగ్ రిలీజ్ చేశారు. స్టార్టింగ్ నుంచి పాటలతోనే ప్రమోషన్ చేయడానికి ఫిక్స్ అయిన గౌతమ్ మీనన్ అండ్ కో… తామనుకున్నది సాధించారు. ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ రాగా…. తాజాగా విడుదలైన పాట ఆ రేంజ్ ను ఇంకాస్త పైకి తీసుకెళ్లింది. సినిమాపై అంచనాల్ని పెంచేలా చేసింది. ఓ డిఫరెంట్ ఎప్రోచ్ తో, పక్కా ప్లానింగ్ తో సినిమా ప్రమోషన్ ను చేపడుతున్న గౌతమ్ మీనన్ అండ్ కోను అభినందించాల్సిందే. గతంలో గౌతమ్-చైతూ కాంబినేషన్ లో ఏమాయచేశావె సినిమా వచ్చింది. అందులో ఫ్లేవర్ కొంచెం తాజాగా విడుదలైన చకోరీ సాంగ్ లో కనిపిస్తోంది. రెహ్మాన్ మ్యూజిక్ మత్తు ఈ పాటకు స్పెషల్ ఎట్రాక్షన్ అయితే…. అనంతశ్రీరాం సాహిత్యం ఆ సంగీతానికి మరింత వన్నె తీసుకొచ్చింది. ఇక సినిమా  విడుదల తేదీల విషయానికొస్తే తాజా సమాచారం ప్రకారం…. జూన్ 17న పాటల్ని విడుదల చేసి, జులై 15న సినిమాను థియేర్లలోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.