Telugu Global
NEWS

ఉత్త‌మ్‌కు మ‌రో భంగ‌పాటు త‌ప్ప‌దా?

టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌రో సాహ‌సం చేస్తున్నాడా? బ‌లం లేకున్నా.. కేవ‌లం ఉనికిని చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడా? అంటే అవున‌నే అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. రాజ్య‌స‌భ బ‌రిలో వీహెచ్ చేత పోటీ చేయించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి తెలంగాణ‌ రాష్ట్రం నుంచి ఇద్ద‌రు మాత్ర‌మే రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌గ‌ల‌రు. ప్ర‌తి అభ్య‌ర్థికి క‌నీసం 41 మంది ఎమ్మెల్యేల బ‌లం కావాలి. ఈ లెక్క‌న టీఆర్ ఎ స్ ఇద్ద‌రిని పెద్ద‌ల స‌భ‌కు పంపే ఏర్పాట్ల‌లో ఉంది. […]

ఉత్త‌మ్‌కు మ‌రో భంగ‌పాటు త‌ప్ప‌దా?
X
టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌రో సాహ‌సం చేస్తున్నాడా? బ‌లం లేకున్నా.. కేవ‌లం ఉనికిని చాటుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడా? అంటే అవున‌నే అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. రాజ్య‌స‌భ బ‌రిలో వీహెచ్ చేత పోటీ చేయించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. వాస్త‌వానికి తెలంగాణ‌ రాష్ట్రం నుంచి ఇద్ద‌రు మాత్ర‌మే రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌గ‌ల‌రు. ప్ర‌తి అభ్య‌ర్థికి క‌నీసం 41 మంది ఎమ్మెల్యేల బ‌లం కావాలి. ఈ లెక్క‌న టీఆర్ ఎ స్ ఇద్ద‌రిని పెద్ద‌ల స‌భ‌కు పంపే ఏర్పాట్ల‌లో ఉంది. మ‌రి కాంగ్రెస్ కు అంత బ‌లం లేదు. 2014 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన‌వారు 21 మంది. వీరిలో ఏడుగురు ఇప్ప‌టికే కారెక్కారు. దీంతో మిగిలింది కేవ‌లం 14 మంది. ఈ 14 మంది ఎమ్మెల్యేల బ‌లం ఎలా స‌రిపోతుంది? ఇదే ప్ర‌శ్న ప‌లువురు సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌ల్ని వేధిస్తోంది. అయినా టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌తోపాటు నేత‌లు పోటీకి సుముఖంగా ఉన్నార‌ని తెలుస్తోంది.
వీహెచ్ చేతే ఎందుకు?
ఇందిరా కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడిగా వీహెచ్‌కు పేరుంది. అదే విధేయత సోనియా, రాహుల్ వ‌ద్ద కూడా ఉంది. అందుకే రెండు ప‌ర్యాయాలు బీసీకోటాలో రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌గ‌లిగారు వీహెచ్‌. జూన్ 21తో ఈయ‌న ప‌ద‌వీకాలం ముగియ‌డంతో మ‌రోసారి పోటీ చేయాల‌ని వీహెచ్ ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఉత్త‌మ్ త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అందుకే బ‌లం లేద‌ని తెలిసీ, వీహెచ్ అభ్య‌ర్థిత్వాన్ని స‌మ‌ర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే వీహెచ్ త‌న బ‌ల‌ప‌ర‌చాలంటూ.. టీఆర్ ఎస్ మ‌ద్ద‌తు కోరుతున్నారు. గ‌తంలో త‌మ పార్టీ మ‌ద్ద‌తుతోనే కేశ‌వ‌రావు రాజ్య‌స‌భ‌కు వెళ్లిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ చేసిన సాయానికి రుణం తీర్చుకునే అవ‌కాశం ఇప్పుడు వ‌చ్చింద‌ని అందుకే త‌న అభ్య‌ర్థిత్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. వీహెచ్ లాజిక్ క‌ర‌క్టే..! కానీ, ఇందుకు టీఆర్ ఎస్ స‌సేమీరా అంటుంది. ఈ విష‌యం ఇటు గులాబీ పార్టీ, అటు హ‌స్తం పార్టీ నేత‌లంద‌రికీ తెలుసు. అయినా… దీనివ‌ల్ల ఉత్త‌మ్‌కు రెండు లాభాలు ఉన్నాయి. ఒక‌టి అధికార పార్టీని అడ్డుకోవ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నామ‌ని అధిష్టానం వ‌ద్ద పేరు సంపాదించ‌వ‌చ్చు. రెండోది.. పోటీలో నిలుచోవ‌డం ద్వారా మ‌రోసారి ప్ర‌జ‌ల్లో, పార్టీ కొంత‌కాలం సంద‌డి చేయ‌వ‌చ్చు. ఇదంతా చూసిన కొంద‌రు సొంత‌పార్టీ నాయ‌కులు ఉత్త‌మ్ చొర‌వ చూసి ముచ్చ‌ట‌ప‌డుతోంటే.. ఓడిపోయే చోట పోటీ ఎందుకు? అని మ‌రికొంద‌రు విమ‌ర్శిస్తున్నారు కూడా.
First Published:  27 May 2016 12:06 AM GMT
Next Story