Telugu Global
NEWS

దోస్తుకే ప‌ట్టం!

అంతా అనుకున్న‌ట్టే అయింది. రాజ్య‌స‌భ టికెట్ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావుకే ఖారారైంది. ఇక ఎంపికే లాంఛ‌నం కానుంది. నోటిఫికేష‌న్ విడుద‌లైనప్ప‌టి  నుంచే అనేక మంది ఆశావ‌హులు సీఎం కేసీఆర్‌ను టికెట్‌ను తమకే కేటాయించాల‌ని కోరారు. ముఖ్యంగా న‌మ‌స్తే తెలంగాణ రాజం, న‌ల్ల‌గొండ నుంచి తేరా చిన్న‌ప‌రెడ్డి, పార్టీ కోశాధికారిగా ప‌నిచేసిన దామోద‌ర్ రావు ఆశావ‌హుల జాబితాలో ఉన్నారు. ఆయ‌న మాత్రం త‌న ఆప్త‌మిత్రుడి వైపే మొగ్గుచూపారు. కెప్టెన్ ల‌క్ష్మికాంతారావుకు క‌రీంన‌గ‌ర్‌లో కెప్టెన్ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ద‌దిక్కుగా ఉంటున్నారు. […]

దోస్తుకే ప‌ట్టం!
X
అంతా అనుకున్న‌ట్టే అయింది. రాజ్య‌స‌భ టికెట్ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావుకే ఖారారైంది. ఇక ఎంపికే లాంఛ‌నం కానుంది. నోటిఫికేష‌న్ విడుద‌లైనప్ప‌టి నుంచే అనేక మంది ఆశావ‌హులు సీఎం కేసీఆర్‌ను టికెట్‌ను తమకే కేటాయించాల‌ని కోరారు. ముఖ్యంగా న‌మ‌స్తే తెలంగాణ రాజం, న‌ల్ల‌గొండ నుంచి తేరా చిన్న‌ప‌రెడ్డి, పార్టీ కోశాధికారిగా ప‌నిచేసిన దామోద‌ర్ రావు ఆశావ‌హుల జాబితాలో ఉన్నారు. ఆయ‌న మాత్రం త‌న ఆప్త‌మిత్రుడి వైపే మొగ్గుచూపారు. కెప్టెన్ ల‌క్ష్మికాంతారావుకు క‌రీంన‌గ‌ర్‌లో కెప్టెన్ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్ద‌దిక్కుగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన‌ప్ప‌టికీ ఆయ‌న ఈసారి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌పై ఆస‌క్తి చూప‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న ప్ర‌జాప్ర‌తినిధి కాదు. మంచి ప‌ద‌విని కెప్టెన్‌కు కానుక‌గా ఇవ్వాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నకేసీఆర్‌కు ఇప్పుడు స‌మ‌యం దొరికింది. నిన్న మొన్న‌టి దాకా ఆయ‌న‌కు బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ కు చైర్మ‌న్‌గా నియ‌మిస్తార‌న్న ప్ర‌చారమూ జ‌రిగింది. అందుకే, ఇప్పుడు రాజ్య‌స‌భ టికెట్ ఇచ్చారు.
కేసీఆర్ కు కెప్టెన్ అత్యంత‌ ఆప్తుడు!
కేసీఆర్- కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. రాష్ట్ర రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారాయన! కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులన్న పేరూ ఉంది. కేసీఆర్‌కు కెప్టెన్‌ ఎంత చెబితే అంత అంటారు పార్టీలోని సీనియర్‌ నాయకులు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌ వెంటే కలిసి నడుస్తున్నారు లక్ష్మీకాంతారావు. అంతేకాదు.. కొన్ని సందర్భాలలో కేసీఆర్‌కు ఆర్ధికసాయాన్ని కూడా అందించారని చెప్పుకుంటారు. రెండుసార్లు కేసీఆర్ క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు స్థానానికి రాజీనామా చేసి, తిరిగి విజ‌యం సాధించ‌డంలో ఆయ‌న పాత్ర ఎంతో ఉంది. రెండుసార్లు జాతీయ స్థాయిలో తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోసిన క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో కేసీఆర్ విజ‌యానికి కృషి చేయ‌డం ద్వారా వారి బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. లక్ష్మీకాంతరావుకు, కేసీఆర్‌కు మధ్య ఇంత దోస్తానీ ఉంది కాబట్టే ఆయన అడగగానే సతీశ్‌బాబుకు 2014 ఎన్నిక‌ల్లో హుస్నాబాద్‌ టికెట్‌ ఇచ్చారు కేసీఆర్‌.. ఇవ్వడమే కాదు గెలిపించారు కూడా! అంతటితో ఆగకుండా సతీశ్‌ బాబుకు పార్లమెంటరీ సెక్రటరీ పదవిని కూడా కట్టబెట్టి గౌరవించారు.
First Published:  26 May 2016 11:07 PM GMT
Next Story