Telugu Global
Cinema & Entertainment

 బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు...

సునీల్ కు ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. దాదాపు మూడేళ్లుగా సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ గ్యాప్ లో అతడ్ని మళ్లీ కామెడీ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ వైపు వచ్చేయాల్సిందిగా చాలామంది సలహాలు ఇస్తున్నారు. అలాంటి ఓ బంగారం లాంటి అవకాశం సునీల్ కు వచ్చింది కూడా. కానీ దాన్ని సునీల్ మిస్ చేసుకున్నాడు. చిరంజీవి 150వ సినిమాలో సునీల్ కోసం ఓ మంచి పాత్రను ప్లాన్ చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ […]

 బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు...
X
సునీల్ కు ఈమధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. దాదాపు మూడేళ్లుగా సక్సెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ గ్యాప్ లో అతడ్ని మళ్లీ కామెడీ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ వైపు వచ్చేయాల్సిందిగా చాలామంది సలహాలు ఇస్తున్నారు. అలాంటి ఓ బంగారం లాంటి అవకాశం సునీల్ కు వచ్చింది కూడా. కానీ దాన్ని సునీల్ మిస్ చేసుకున్నాడు. చిరంజీవి 150వ సినిమాలో సునీల్ కోసం ఓ మంచి పాత్రను ప్లాన్ చేశారు. దర్శకుడు వీవీ వినాయక్ కేవలం సునీల్ ను దృష్టిలో పెట్టుకొనే ఆ పాత్ర రాశాడు. చిరు సినిమా కాబట్టి సునీల్ కూడా ఒప్పుకున్నాడు. పైగా తనకు ఫ్లాపులు ఉన్నాయి కాబట్టి చిరు సినిమాతో మరోసారి కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోవాలని అనుకున్నాడు. కానీ వినాయక్ ఏకంగా 40రోజుల బల్క్ కాల్షీట్లు అడిగాడట. మరోవైపు సునీల్ ఒకేసారి 3 సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. దీంతో ఒకేసారి 40 కాల్షీట్లు అడ్జెస్ట్ చేయలేక… టోటల్ ప్రాజెక్ట నుంచే సునీల్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ మిస్ చేసుకున్న ఆ పాత్రను వెన్నెల కిషోర్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. చిరంజీవితో కలిసి సినిమా చేయాలనేది వెన్నెల కిషోర్ చిరకాల కోరిక. ఆ కోరిక ఇలా నెరవేరబోతోంది.
First Published:  26 May 2016 9:47 PM GMT
Next Story