Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2 విడుదల తేదీ ఫిక్స్ వెనక కారణాలు..?

బాహుబలి-2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ముందు-వెనక అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. బాహుబలి రిలీజ్ కు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. తాజాగా పార్ట్-2కు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తయిపోతుంది. ఇంకా కాదనుకుంటే నవంబర్ నాటికి ప్యాచ్ వర్క్ తో సహా కంప్లీట్ అవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ అన్నీ సైమల్టేనియస్ గా జరుగుతాయి కాబట్టి… సినిమా ఫస్ట్ కాపీని […]

బాహుబలి-2 విడుదల తేదీ ఫిక్స్ వెనక కారణాలు..?
X
బాహుబలి-2 లాంటి ప్రతిష్టాత్మక సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ముందు-వెనక అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. బాహుబలి రిలీజ్ కు కూడా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. తాజాగా పార్ట్-2కు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తయిపోతుంది. ఇంకా కాదనుకుంటే నవంబర్ నాటికి ప్యాచ్ వర్క్ తో సహా కంప్లీట్ అవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ అన్నీ సైమల్టేనియస్ గా జరుగుతాయి కాబట్టి… సినిమా ఫస్ట్ కాపీని వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం చేసేయొచ్చు. కానీ రాజమౌళి మాత్రం పార్ట్-2ను సమ్మర్ ఎట్రాక్షన్ గానే తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఏప్రిల్ 14ను ముహూర్తంగా నిర్ణయించాడు. దీనికి కారణం ఆ టైమ్ లో బాక్సాఫీస్ లో గ్యాప్ ఎక్కువగా ఉండడమే. ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరం. కాబట్టి తమిళనాట అంతా ఫెస్టివ్ మూడ్ లో ఉంటారు. మరోవైపు ఆ రోజు గుడ్ ఫ్రైడే పడింది. కాబట్టి ప్రపంచంలో చాలా భాగం ప్రజలు పండగ చేసుకుంటారు. మరోవైపు ఆ తేదీ నుంచి దాదాపు నెలన్నర పాటు బడా బాలీవుడ్ సినిమా ఏదీ విడుదల కావడం లేదు. ఈ లెక్కలన్నీ సరిచూసుకున్న తర్వాతే… ఏప్రిల్ 14ను ఫిక్స్ చేశారు బాహుబలి మేకర్స్.
First Published:  26 May 2016 9:46 PM GMT
Next Story