Telugu Global
CRIME

హ‌త్య నేను చేశా...కాదు నేనే చేశా!

ఎక్క‌డైనా హ‌త్య జ‌రిగితే నేను చేయ‌లేదంటే నేను చేయ‌లేదంటూ అంతా త‌ప్పుకోవాల‌ని చూస్తారు. కానీ ఆ కుటుంబంలోని వారు మాత్రం నేను చేశానంటే…నేనే చేశానంటూ పోలీసుల ముందుకు వ‌చ్చారు. నైరుతి ఢిల్లీలోని సాగ‌ర్‌పూర్ ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వీరేంద‌ర్ (48) అనే వ్య‌క్తి హ‌త్య‌కు గురికాగా పోలీసులు అత‌ని ఇంటికి వెళ్ల‌గా ఈ ప‌రిస్థితి ఎదురైంది. వీరేంద‌ర్‌కి భార్య ఒక కుమార్తె, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. భార్య వ‌య‌సు 45 కాగా పిల్ల‌లంతా 20ఏళ్ల లోపువారు. […]

ఎక్క‌డైనా హ‌త్య జ‌రిగితే నేను చేయ‌లేదంటే నేను చేయ‌లేదంటూ అంతా త‌ప్పుకోవాల‌ని చూస్తారు. కానీ ఆ కుటుంబంలోని వారు మాత్రం నేను చేశానంటే…నేనే చేశానంటూ పోలీసుల ముందుకు వ‌చ్చారు. నైరుతి ఢిల్లీలోని సాగ‌ర్‌పూర్ ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. వీరేంద‌ర్ (48) అనే వ్య‌క్తి హ‌త్య‌కు గురికాగా పోలీసులు అత‌ని ఇంటికి వెళ్ల‌గా ఈ ప‌రిస్థితి ఎదురైంది. వీరేంద‌ర్‌కి భార్య ఒక కుమార్తె, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. భార్య వ‌య‌సు 45 కాగా పిల్ల‌లంతా 20ఏళ్ల లోపువారు. అయితే వీరంతా ఎవ‌రికి వారు హ‌త్యా నేరాన్ని త‌మ‌మీద వేసుకోవాల‌ని చూశారు. వీరేంద‌ర్ తాగుబోతు. అత‌ను తాగి వ‌చ్చి భార్య మిథ్‌లేష్‌ని బాగా హింసించేవాడు. గురువారం కూడా అలాగే గొడ‌వ జ‌రిగింది. వీరేంద‌ర్ త‌న భార్య‌ని కొడుతుండ‌గా పిల్ల‌లంతా అడ్డుకున్నారు. ఈ గొడవ‌లో వీరేంద‌ర్ క‌త్తిపోటుకి గుర‌య్యాడు. కుటుంబ‌మంతా తామే హ‌త్య చేశామ‌ని ముందుకు వ‌స్తున్నా ప్రాథ‌మిక విచార‌ణ అనంత‌రం వీరేంద‌ర్ పెద్ద కుమారుడుని ఈ కేసులో ప్ర‌ధాన‌ నిందితుడుగా పోలీసులు గుర్తించారు. అయితే మిగిలిన కుటుంబ స‌భ్యుల‌ను కూడా విచారించాల్సి ఉంద‌ని, పూర్తిగా విచార‌ణ చేయ‌నిదే ఈ కేసులో దోషులెవ‌రో తెలుసుకోవ‌టం క‌ష్ట‌మ‌ని పోలీసులు పేర్కొన్నారు.

First Published:  26 May 2016 11:21 PM GMT
Next Story