కుప్పం కుప్పకూలింది బాబూ!- కలెక్టర్ల మీటింగ్‌లో వెల్లడి

చంద్రబాబు ఇటీవల పదేపదే మనం సింగపూర్, జపాన్‌, టోక్యో రేంజ్‌కు ఎదగాలని చెబుతున్నారు. 2019 నాటికి ఏపీని దేశంలో నెంబర్‌ 1, 2029 నాటికి ప్రపంచంలోనే బెస్ట్ స్టేట్‌గానూ, 2050 ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంచుతామని చెబుతున్నారు. అయితే స్టేట్ సంగతేమో గానీ చంద్రబాబు సొంత మండలం అభివృద్ధిలో మూలనపడింది. విజయవాడలో జరిగిన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో అభివృద్ధి నివేదికలను విడుదల చేశారు.

ఈ నివేదికల్లో చంద్రబాబుకు ముఖం దాచుకునేలా గణాంకాలు ఉన్నాయి. పనితీరు సూచీల్లో 13 జిల్లాల జాబితాలో చిత్తూరు జిల్లా 8వ స్థానంలో ఉంది. మొదటి సారిగా జిల్లాల్లోని మండలాల పనితీరుపైనా సర్వే చేసి నివేదిక రూపొందించారు. చిత్తూరు జిల్లాలో అభివృద్ధిపరంగా టాప్ 10 మండలాల్లో చంద్రబాబు సొంతనియోజకవర్గ మండల కేంద్రం కుప్పం లేదు. జిల్లాల్లోనే అత్యంతవెనుకబడిన మండలంగా కుప్పం ఖ్యాతిని సంపాదించింది. సీఎం సొంతం మండలంలోనే ఈపరిస్థితి చూసి అందరూ షాక్ అయ్యారు.

ఇంటిని గెలవలేని వాడు ఊరిని గెలుస్తా అని బయలుదేరినట్టుగా బాబు వ్యవహారం ఉందని అధికారులు సెటైర్లు వేసుకున్నారు. ఇంతకాలం హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టే పనిలో నిమగ్నమై సొంతమండలాన్ని కనీసం ఏపీ అభివృధ్ధి మ్యాప్‌లో పెట్టే విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారని మరికొందరు నవ్వుకున్నారు.

Click on Image to Read:

tdp-leaders

Bojjala-Gopala

eenadu amaravathi artical

ysrcp-mla's

pati-pati-pullarao-acham-na

venkaiah

jalil-khan

vijayasai-reddy

chintamaneni-prabhakar1

trs

vijayasai-reddy-YS-Jagan

Kidnap

Defection-Act-1

chandrababu-park-hyatt-hote

rajareddy