Telugu Global
Cinema & Entertainment

'ఎందుకు పిలిచావ్?' అని కత్రినాపై దుర్భాషలాడిన మీడియా!

అది ముంబై ఎయిర్‌పోర్ట్. కత్రినా కైఫ్ విదేశాల నుండి ఇండియా తిరిగొచ్చిన సందర్భం., శుక్రవారం, 27 మే. ఎయిర్‌పోర్ట్‌ వద్ద మీడియా మిత్రులు కాచుకుని ఉన్నారు. కత్రినాను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన వెంటనే కెమేరాలు క్లిక్ మనిపిస్తూ ఆమె కామెంట్ కోసం మైకులు పట్టుకుని ఆమె వెనుక పరుగెత్తినా.. కత్రినా ఆగలేదు సరికదా.. కనీసం ఫోటోస్‌కి ఫోజైనా ఇవ్వలేదు. మండిపోయిన మీడియా పర్సన్స్ ‘నువ్వే కదా పిలిచింది?’ అని అరిచినా కత్రినా వినిపించుకోలేదు. కోపంతో ఒకరు ‘ఎందుకు పిలిచావ్?’ […]

అది ముంబై ఎయిర్‌పోర్ట్. కత్రినా కైఫ్ విదేశాల నుండి ఇండియా తిరిగొచ్చిన సందర్భం., శుక్రవారం, 27 మే. ఎయిర్‌పోర్ట్‌ వద్ద మీడియా మిత్రులు కాచుకుని ఉన్నారు. కత్రినాను ఎయిర్‌పోర్ట్‌లో చూసిన వెంటనే కెమేరాలు క్లిక్ మనిపిస్తూ ఆమె కామెంట్ కోసం మైకులు పట్టుకుని ఆమె వెనుక పరుగెత్తినా.. కత్రినా ఆగలేదు సరికదా.. కనీసం ఫోటోస్‌కి ఫోజైనా ఇవ్వలేదు. మండిపోయిన మీడియా పర్సన్స్ ‘నువ్వే కదా పిలిచింది?’ అని అరిచినా కత్రినా వినిపించుకోలేదు. కోపంతో ఒకరు ‘ఎందుకు పిలిచావ్?’ అని అరుస్తున్నా పట్టించుకోకుండా తన కార్‌లో ఎక్కి కూచుంది. ‘నేను పిలవలేదు’, అంటూ ఎదో సణిగింది సదరు నటీమణి. చూడడానికి ఇది మీడియా మిత్రుల ఓవర్‌యాక్షన్‌లా కనపడుతున్నా.. ఆమె ఇండియాకి వస్తుందని… ముంబై ఎయిర్‌పోర్ట్‌లో T2 నుండి ఫలానా గేట్ నుండి వస్తుందనే ఫీడ్ ఇవ్వడం మాత్రం ఆమె PR టీమ్ పనే అయ్యి ఉంటుంది కదా! మరి కవరేజ్ కావాలి కాని.. వారు పడిగాపులు కాచుకుని వెయిట్ చేసినందుకు కొంత సేపు కేటాయిస్తే ఏంపోతుంది?

First Published:  27 May 2016 9:09 PM GMT
Next Story