Telugu Global
Cinema & Entertainment

చివరి నిముషంలో కమల్ చేరుకుని బ్రతికించాడు

కమల్ హాసన్  సినిమా ‘శభాష్ నాయుడు’ కోసం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యిపోయి..  లాస్ ఏంజిలెస్‌లో షూటింగ్ చేసుకోవడం మొదలయ్యింది. కాని అంతకు ముందు టీం అంతా అమెరికాలో వెయిట్ చేస్తూ ఉన్నారు కమల్ హాసన్ రాక కోసం. వీసా మరియు పర్మిషన్‌లు అన్నీ పూర్తి చేసుకుని… మూడు బవుండ్ స్క్రిప్ట్స్‌తో సహా చివరికి కమల్ హాసన్ చేరుకోవడం వల్ల యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుందట. లేకపోతే  అమెరికాలో షూటింగ్ ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యేవట. ఈ విషయం స్వయంగా […]

చివరి నిముషంలో కమల్ చేరుకుని బ్రతికించాడు
X

కమల్ హాసన్ సినిమా ‘శభాష్ నాయుడు’ కోసం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యిపోయి.. లాస్ ఏంజిలెస్‌లో షూటింగ్ చేసుకోవడం మొదలయ్యింది. కాని అంతకు ముందు టీం అంతా అమెరికాలో వెయిట్ చేస్తూ ఉన్నారు కమల్ హాసన్ రాక కోసం. వీసా మరియు పర్మిషన్‌లు అన్నీ పూర్తి చేసుకుని… మూడు బవుండ్ స్క్రిప్ట్స్‌తో సహా చివరికి కమల్ హాసన్ చేరుకోవడం వల్ల యూనిట్ మొత్తం ఊపిరి పీల్చుకుందట. లేకపోతే అమెరికాలో షూటింగ్ ప్లాన్స్ అన్నీ తారుమారు అయ్యేవట. ఈ విషయం స్వయంగా కమల్ హాసన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నాడు. ఈ సినిమాలో మొదటిసారిగా, కమల్ తన కూతురు శృతి హాసన్‌తో కలిసి నటిస్తున్నాడు. అంతేకాక కమెడియన్ బ్రహ్మానందంతో కూడా కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఇది మొదటి సినిమా. ఈ సినిమా ఒక పొలిటికల్ సెటైర్ అని కమల్ చాలా కేర్ తీసుకుని చేస్తున్నాడు. సినిమా మొదలవ్వక ముందే టైటిల్ చిన్న క్యాస్ట్ కాంట్రవర్సీలో చిక్కుకుందీ ప్రాజెక్ట్. కాని కమల్ దానిని పట్టించుకోకుండా అదే టైటిల్‌తో షూటింగ్ చేస్తున్నాడు.

First Published:  27 May 2016 9:00 PM GMT
Next Story