Telugu Global
Cinema & Entertainment

పోయిన చోటే వెదుక్కుంటున్న పవన్ దర్శకులు

ఎక్కడ పోయిందో అక్కడే వెదుక్కోవాలనేది పాపులర్ సామెత. ఆ సామెతను ఇప్పుడు ఇద్దరు దర్శకులు పాటిస్తున్నారు. ఎక్కడ, ఎవరితో ఫ్లాపులు ఇచ్చామో… వాళ్లతోనే తిరిగి హిట్ కొట్టాలనే కసితో రగిలిపోతున్నారు. ఇక్కడ గమ్మత్తేంటంటే… వాళ్లిద్దరూ పవన్ దర్శకులే కావడం విశేషం. పవన్ తో గతంలో ఖుషి, కొమరం పులి లాంటి సినిమాలు చేసిన దర్శకుడు ఎస్ జే సూర్య. ఈ దర్శకుడు ఆమధ్య పవన్ తో చేసిన కొమరం పులి సినిమా ఏ రేంజ్ ఫ్లాపో అందరికీ […]

పోయిన చోటే వెదుక్కుంటున్న పవన్ దర్శకులు
X

ఎక్కడ పోయిందో అక్కడే వెదుక్కోవాలనేది పాపులర్ సామెత. ఆ సామెతను ఇప్పుడు ఇద్దరు దర్శకులు పాటిస్తున్నారు. ఎక్కడ, ఎవరితో ఫ్లాపులు ఇచ్చామో… వాళ్లతోనే తిరిగి హిట్ కొట్టాలనే కసితో రగిలిపోతున్నారు. ఇక్కడ గమ్మత్తేంటంటే… వాళ్లిద్దరూ పవన్ దర్శకులే కావడం విశేషం. పవన్ తో గతంలో ఖుషి, కొమరం పులి లాంటి సినిమాలు చేసిన దర్శకుడు ఎస్ జే సూర్య. ఈ దర్శకుడు ఆమధ్య పవన్ తో చేసిన కొమరం పులి సినిమా ఏ రేంజ్ ఫ్లాపో అందరికీ తెలుసు. అందుకే ఆ ఫ్లాప్ కు ప్రతీకారంగా ఓ భారీ హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో… తిరిగి పవన్ తోనే మరో సినిమా ప్లాన్ చేశాడు. వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వస్తుంది ఈ సినిమా. పోయినచోటే వెదుక్కుంటున్న మరో పవన్ దర్శకుడు కరుణా కరన్. ఈ దర్శకుడు ఆమధ్య రామ్ తో ఎందుకంటే ప్రేమంట అనే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా బ్రహ్మాండమైన ఫ్లాప్. సో… తిరిగి రామ్ కు హిట్ ఇవ్వాలనే కసితో రామ్ తోనే మరో సినిమా ప్లాన్ చేశాడు కరుణా కరన్. తనకు బాగా కలిసొచ్చిన ప్రేమకథనే రామ్ కు వినిపించి ఓకే చేయింటుకున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వస్తుంది. ప్రస్తుతం కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీతో పాటు కరుణాకరన్ మూవీని పట్టాలపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

First Published:  27 May 2016 11:25 PM GMT
Next Story