Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2కు స్వల్ప ఆటంకం

బాహుబలి సినిమా యూనిట్ మొత్తం వర్క్ మూడ్ లోకి వచ్చేసింది. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఓ 10 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్తారు. అయితే ఈ గ్యాప్ లో బాహుబలి-2 యూనిట్ లో చిన్న అపశృతి చోటుచేసుకుంది. హీరో రానాకు ఊహించని విధంగా గాయమైంది. దీంతో యూనిట్ సభ్యులే కాదు… అభిమానులు కూడా అవాక్కయ్యారు. రానాకు ఎలా ఉందో అని ఆరాలు తీశారు. షూటింగ్ పరిస్థితేంటని ప్రశ్నలు వేయడం […]

బాహుబలి-2కు స్వల్ప ఆటంకం
X

బాహుబలి సినిమా యూనిట్ మొత్తం వర్క్ మూడ్ లోకి వచ్చేసింది. కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. ఓ 10 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత రెగ్యులర్ షూటింగ్ లోకి వెళ్తారు. అయితే ఈ గ్యాప్ లో బాహుబలి-2 యూనిట్ లో చిన్న అపశృతి చోటుచేసుకుంది. హీరో రానాకు ఊహించని విధంగా గాయమైంది. దీంతో యూనిట్ సభ్యులే కాదు… అభిమానులు కూడా అవాక్కయ్యారు. రానాకు ఎలా ఉందో అని ఆరాలు తీశారు. షూటింగ్ పరిస్థితేంటని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అనవసర ఆందోళనలు ఎందుకునే ఉద్దేశంతో… నేరుగా రానానే రంగంలోకి దిగాడు. తన గాయానికి సంబందించిన డీటెయిల్స్ ను ట్విట్టర్ లో పంచుకున్నాడు. యుద్ధ‌స‌న్నివేశాల రిహార్స‌ల్‌లో మణికట్టుకు గాయమైంద‌ని, బ్యాండేజ్ వేసుకున్నానని రానా త‌న ఖాతాలో ట్వీటాడు. 2017లో విడుద‌లే ల‌క్ష్యంగా బాహుబలి- 2 షూటింగ్ జోరుగా కొన‌సాగుతోంది. ఇందులో పాత్ర‌ధారులు, టెక్నీషియ‌న్లు కూడా మూవీ కోసం తెగ క‌ష్ట‌ప‌డుతున్నార‌ట‌. అనుకున్న స‌మ‌యానికి మూవీని రిలీజ్ చేసేందుకు కృషి చేస్తున్నార‌ట‌.

First Published:  27 May 2016 11:24 PM GMT
Next Story