Telugu Global
NEWS

లోకేశ్‌ వ్యాఖ్యలతో టీడీపీ ఖాళీయేనా?

తెలంగాణ టీడీపీ నేతలకు రాజ్యసభ పదవులు ఇచ్చేది లేదని చెప్పిన ఏపీ సీఎం కుమారుడు లోకేశ్‌ ఆ పార్టీకి మరింత చేటు తెచ్చేలా ఉంది. పార్టీ అధ్యక్షుడి తీరుతో ఇప్పటికే పార్టీకి చాలా నష్టం వాటిల్లింది. తెలుగుదేశం అంటేనే.. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. అయినా.. ఏదోలా పార్టీని నడిపిస్తున్న తెలంగాణ నేతలను  మరింత నిరుత్సాహ పరిచేలా లోకేశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం తెలుగు తమ్ముళ్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటికే గ్రామస్థాయి, మండలస్థాయిలో చోటామోటా నేతలంతా ఎవరిదారి వారు […]

లోకేశ్‌ వ్యాఖ్యలతో టీడీపీ ఖాళీయేనా?
X
తెలంగాణ టీడీపీ నేతలకు రాజ్యసభ పదవులు ఇచ్చేది లేదని చెప్పిన ఏపీ సీఎం కుమారుడు లోకేశ్‌ ఆ పార్టీకి మరింత చేటు తెచ్చేలా ఉంది. పార్టీ అధ్యక్షుడి తీరుతో ఇప్పటికే పార్టీకి చాలా నష్టం వాటిల్లింది. తెలుగుదేశం అంటేనే.. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. అయినా.. ఏదోలా పార్టీని నడిపిస్తున్న తెలంగాణ నేతలను మరింత నిరుత్సాహ పరిచేలా లోకేశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం తెలుగు తమ్ముళ్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పటికే గ్రామస్థాయి, మండలస్థాయిలో చోటామోటా నేతలంతా
ఎవరిదారి వారు చూసుకున్నారు. అంతో కొంతో జనాల్లో గుర్తింపు ఉన్న నేతలు సైతం తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టమే అనితెలిసినా.. ఇంతకాలం సేవ చేసిన పార్టీ ఏదో పదవి ఇచ్చి ఆదుకోకపోతుందా?అని ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ, రాజ్యసభ టికెట్‌ కేటాయింపుల్లో తెలంగాణ నేతలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇక్కడి నేతలకు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
ఇక ఇదే పార్టీలో కొనసాగితే లాభం లేదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో పేరు మోసిన లీడర్లయిన మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్‌, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ఎల్‌. రమణ
తదితరులను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడమే వారి ఆందోళనకు కారణం. పార్టీలో 30 ఏళ్లుగా పనిచేసిన వారికే దిక్కులేదు. ఇక చోటామోటా నేతలకు ఎలా న్యాయం చేస్తారన్న ఆందోళన వారిలో రోజురోజుకు పెరిగిపోతోంది. దీనికితోడు లోకేశ్‌ వ్యాఖ్యలు వారి ఆందోళనను రెట్టింపు చేశాయి.
ఇక పార్టీ విలీనమేనా?
తెలంగాణ తెలుగుదేశం అసెంబ్లీలో ఇప్పటికే అధికార పార్టీలో విలీనమైంది. ఇక రాజకీయ విభాగంగా ఉన్న పార్టీ శాఖ కూడా విలీనం కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణతోపాటు మిగిలిన జిల్లాల పార్టీ అధ్యక్షులంతా కలిసి ఈ మేరకు త్వరలోనే ఎన్నికల సంఘానికి లేఖ ఇవ్వనున్నారని ప్రచారం జరిగింది. అయితే, దీన్ని ఎల్‌.రమణ ఖండించారు. అయినప్పటికీ.. తెలంగాణలో పార్టీ గురించి
మొదటి నుంచి ముందస్తుగా పత్రికల్లో వస్తున్న కథనాలు నిజమవుతున్న వేళ విలీనం ప్రక్రియ మాత్రం కాస్త జాప్యం జరిగింది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు ఒక క్రమపద్ధతిలో జరుగుతున్నాయి. ఆయా పార్టీలు తెలంగాణ విషయంలో వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నపుడు ఈ ఫిరాయింపులు, పార్టీ విలీనాలు చోటుచేసుకుంటున్నాయి. అంటే.. ఫిరాయింపులను సైతం సమర్థించుకునేలా జాగ్రత్త పడుతున్నారు కేసీఆర్‌. అందుకే, తాజాగా తెలంగాణనేతలకు ఎలాంటి రాజ్యసభ సీటు ఇచ్చేది లేదని లోకేశ్‌ చేసిన వ్యాఖ్యల్ని కారణంగా చూపి కొంతకాలానికి పార్టీ మొత్తం ఖాళీ చేస్తారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
First Published:  27 May 2016 11:07 PM GMT
Next Story