Telugu Global
Cinema & Entertainment

మహేష్-మురుగుదాస్ సినిమా అప్ డేట్స్ ఇవే...

ప్రస్తుతం మహేష్ బాబు హాలిడేలో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చేనెల 20న తిరిగి ఇండియాకు వస్తాడు. ఆ వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో సినిమాను పట్టాలపైకి తీసుకొస్తాడు. పూజాకార్యక్రమాల్ని నిరాడంబరంగా జరిపి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్స్ పైకి వెళ్లాలని మహేష్ నిర్ణయించాడు. అతడి ఆలోచనలకు తగ్గట్టే ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే… వచ్చే నెల 24న మహేష్-మురుగుదాస్ సినిమా ప్రారంభం అవ్వడం, రెగ్యులర్ షూటింగ్ కూడా కొనసాగడం […]

మహేష్-మురుగుదాస్ సినిమా అప్ డేట్స్ ఇవే...
X

ప్రస్తుతం మహేష్ బాబు హాలిడేలో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. వచ్చేనెల 20న తిరిగి ఇండియాకు వస్తాడు. ఆ వెంటనే మురుగదాస్ దర్శకత్వంలో సినిమాను పట్టాలపైకి తీసుకొస్తాడు. పూజాకార్యక్రమాల్ని నిరాడంబరంగా జరిపి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్స్ పైకి వెళ్లాలని మహేష్ నిర్ణయించాడు. అతడి ఆలోచనలకు తగ్గట్టే ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే… వచ్చే నెల 24న మహేష్-మురుగుదాస్ సినిమా ప్రారంభం అవ్వడం, రెగ్యులర్ షూటింగ్ కూడా కొనసాగడం జరిగిపోతాయి. మరోవైపు ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరనే అంశంపై మేకర్స్ ఇంకా ఓ అభిప్రాయానికి రాలేదు. మొన్నటి్వరకు పరిణీతి చోప్రాను తీసుకుంటారనే టాక్ వచ్చినప్పటికీ… బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని, ఆమెను తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. బ్రహ్మోత్సవం సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో… తాజా సినిమాకు బడ్జెట్ లో భారీ కోత విధించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా… హీరోయిన్ పారితోషికం విషయంలో కూడా మేకర్స్ ఆలోచనలో పడ్డారు. తక్కువ రెమ్యునరేషన్ కే వస్తున్న కీర్తి సురేష్, సాయి పల్లవి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. మహేష్ ఇండియాకు వచ్చిన వెంటనే హీరోయిన్ పై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

First Published:  27 May 2016 11:26 PM GMT
Next Story