Telugu Global
Cinema & Entertainment

బన్నీ కొత్త సినిమా దర్శకుడు, తేదీ ఖరారు

సరైనోడు సక్సెస్ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనే అనుమానం చాలామందిలో ఉంది. మరీ ముఖ్యంగా రేసులో ఇద్దరు దర్శకులు మిగిలారు.తమిళ దర్శకుడు లింగుస్వామికి అవకాశమిస్తాడా..లేక విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడా అనే అనుమానాలు అందర్లో ఉన్నాయి. ఫైనల్ గా లింగుస్వామికే బన్నీ అవకాశం ఇచ్చాడు. స్క్రీన్ ప్లే పూర్తిచేయడానికి విక్రమ్ కుమార్ మరింత సమయఁ కోరడంతో… ఆటోమేటిగ్గా అవకాశం లింగుస్వామిని వరించింది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ తేదీని […]

బన్నీ కొత్త సినిమా దర్శకుడు, తేదీ ఖరారు
X

సరైనోడు సక్సెస్ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేస్తాడనే అనుమానం చాలామందిలో ఉంది. మరీ ముఖ్యంగా రేసులో ఇద్దరు దర్శకులు మిగిలారు.తమిళ దర్శకుడు లింగుస్వామికి అవకాశమిస్తాడా..లేక విలక్షణ దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడా అనే అనుమానాలు అందర్లో ఉన్నాయి. ఫైనల్ గా లింగుస్వామికే బన్నీ అవకాశం ఇచ్చాడు. స్క్రీన్ ప్లే పూర్తిచేయడానికి విక్రమ్ కుమార్ మరింత సమయఁ కోరడంతో… ఆటోమేటిగ్గా అవకాశం లింగుస్వామిని వరించింది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ తేదీని కూడా ఖరారు చేశారు. వచ్చేనెల 15న ఈ సినిమా హైదరాబాద్ లో ప్రారంభం అవుతుంది. ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కిస్తారు. యాక్షన్-రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో హీరోయన్ ఎవరనే అంశాన్ని ఇంకా తేల్చలేదు. కుదిరితే సమంత, కుదరకపోతే రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. తెలుగు వెర్షన్ ను గీతాఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తారు. ఇక తమిళ వెర్షన్ ను స్టుడియో గ్రీన్స్ సంస్థ నిర్మిస్తుంది.

First Published:  29 May 2016 1:21 AM GMT
Next Story